News April 1, 2024

బెయిల్ పిటిషన్‌పై విచారణ ప్రారంభం

image

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారణ ప్రారంభమైంది. రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరీ బవేజా ముందు వాదనలు కొనసాగుతున్నాయి. కవిత తరఫున న్యాయవాది నితీశ్ రానా, ఈడీ తరఫున జోహెబ్ హొస్సేన్ వాదనలు వినిపిస్తున్నారు.

Similar News

News February 17, 2026

సుల్తానాబాద్‌ మున్సిపల్‌ పీఠంపై వీడని ఉత్కంఠ!

image

ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ పాలకవర్గాల ఎన్నిక ప్రక్రియ ముగిసినా, సుల్తానాబాద్‌లో మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. 15 వార్డులకు గాను కాంగ్రెస్‌ 12 చోట్ల విజయం సాధించగా, అభ్యర్థి ఎంపికపై ఏకాభిప్రాయం కుదరలకపోవడంతో ఎన్నికను ఈరోజుకి వాయిదా వేశారు. ఛైర్మన్‌ రేసులో బిరుదు రాధాకృష్ణ, అంతటి పుష్పలత, గాజుల రాజమల్లు, భాకం కిరణ్‌ యాదవ్‌ల పేర్లు వినిపిస్తుండగా, పీఠం ఎవరిని వరిస్తుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

News February 17, 2026

పిల్లల్ని కనేముందు కౌన్సిలింగ్ అవసరం

image

పెళ్లి తర్వాత పిల్లల ప్లానింగ్‌కు ముందు భార్యాభర్తలు కౌన్సెలింగ్‌ తీసుకోవడం ద్వారా అనవసర భయాలు తొలగిపోతాయంటున్నారు నిపుణులు. మధుమేహం, థైరాయిడ్, అధిక రక్తపోటు లాంటి సమస్యలుంటే ముందే గుర్తించి చికిత్స తీసుకోవాలి. సహజంగా గర్భం దాల్చలేకపోతే దంపతులిద్దరూ వైద్యులను సంప్రదించాలి. అలాగే కౌన్సిలింగ్ తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ, పేరెంటింగ్‌పై అవగాహన పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

News February 17, 2026

డబ్బులే డబ్బుల్.. దేశంలో భారీగా క్యాష్ ట్రాన్సాక్షన్స్

image

దేశంలో డిజిటల్ పేమెంట్స్ జోరు కొనసాగుతున్నా ఇంకా నగదు చలామణి భారీగా ఉందని SBI లేటెస్ట్ రిపోర్ట్ తెలిపింది. JANలో రూ.40లక్షల కోట్లు చేతులు మారినట్లు పేర్కొంది. గతేడాదితో పోలిస్తే ఇది 11.1% ఎక్కువ. నగదు చలామణిలో 97.6% ప్రజల వద్దే నోట్ల రూపంలో ఉంది. నెలకు రూ.40లక్షల కంటే ఎక్కువ UPI లావాదేవీలు జరిపితే GST నోటీసులు, ఇన్‌కమ్ ట్యాక్స్ భయాలతో నగదు బదిలీ పెరిగినట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.