News April 20, 2024

న్యాయం, ధర్మం కోసమే పోటీ: షర్మిల

image

AP: జగన్‌ను చిన్న రాయితో కొడితేనే హత్యాయత్నం అంటున్నారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. కడప ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆమె మాట్లాడారు. విజయమ్మను అవమానించే స్థాయికి కొందరు దిగజారిపోయారని దుయ్యబట్టారు. తాను న్యాయం, ధర్మం కోసం పోటీ చేస్తున్నానని.. హత్యారాజకీయాలు అంతం కావాలన్నారు. ప్రజలు న్యాయం వైపు ఉన్నారా లేదా అనేది ఆలోచించుకోవాలన్నారు.

Similar News

News December 9, 2025

బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీకి సీక్వెల్?

image

బ్లాక్‌బస్టర్ మూవీ ‘3 ఇడియట్స్’కు సీక్వెల్ రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, త్వరలోనే అధికారిక ప్రకటన రావొచ్చని చర్చ జరుగుతోంది. ఈ సినిమాలోని మెయిన్ క్యారెక్టర్స్ 15 ఏళ్ల తర్వాత కలుసుకుంటే ఏం జరుగుతుందనే పాయింట్‌తో తెరకెక్కనుందని సమాచారం. రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన ‘3 ఇడియట్స్’లో ఆమిర్ ఖాన్, మాధవన్, శర్మన్ జోషి, కరీనా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు.

News December 9, 2025

చాట్ జీపీటీతో కొత్త వంగడాల సృష్టి సులభమా?

image

వాతావరణ మార్పులు, కరవు, వరదల వల్ల వ్యవసాయంలో కొత్త వంగడాల అవసరం పెరిగింది. కొత్త వంగడాల అభివృద్ధికి ప్రస్తుతం చాలా సమయం పడుతోంది. కానీ జనరేటివ్ ఏఐను ఉపయోగిస్తే అధిక దిగుబడినిచ్చే, వాతావరణ మార్పులను తట్టుకోగల వంగడాలను వేగంగా సృష్టించడం సాధ్యమని నిపుణులు చెబుతున్నారు. జన్యు సమాచారాన్ని విశ్లేషించి ఏ రకమైన జన్యువులను తొలగిస్తే, చేరిస్తే లాభదాయకమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా గుర్తించగలదు.

News December 9, 2025

తేగలు తింటే ఎన్ని లాభాలో..!

image

శీతాకాలంలో తాటి తేగలు (గేగులు) ఎక్కువగా లభిస్తుంటాయి. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అలాగే తేగల్లో ఖనిజాలు, విటమిన్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా రక్తహీనత నివారణ, శరీర బరువును నియంత్రించడంలో ఇవి సహాయపడతాయి. షుగర్ వ్యాధిగ్రస్థులూ తినొచ్చు. తాటి గింజలు మొల‌కెత్తిన‌ప్పుడు నేల‌లో నుంచి త‌వ్వి తీసిన మొల‌క‌లే ఈ తేగలు. మీరెప్పుడైనా టేస్ట్ చేశారా? comment