News May 1, 2024

ప్రత్యేక హోదా కాన్సెప్ట్ ఇప్పుడు లేదు: లోకేశ్

image

AP: ఈ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న టీడీపీ ప్రత్యేక హోదాపై భరోసా ఇవ్వగలదా అనే ప్రశ్నకు ఆ పార్టీ నేత లోకేశ్ స్పందించారు. ‘దేశంలో ప్రత్యేక హోదా కాన్సెప్ట్ ఇప్పుడు లేదు. దానికి ప్రత్యామ్నాయంగా ప్రత్యేక ఇన్సెంటివ్స్, కంపెనీలు తీసుకొచ్చేందుకు ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు’ అని లోకేశ్ చెప్పారు. ప్రత్యేక హోదా గురించి తాము చెప్పలేదని ఆయన అన్నారు.

Similar News

News December 13, 2025

తగ్గిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ వెండి ధర భారీగా తగ్గింది. కేజీ వెండి ధర రూ.5వేలు తగ్గి రూ.2,10,000కి చేరింది. అటు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.270 తగ్గి రూ.1,33,910గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.250 తగ్గి రూ.1,22,750కి చేరింది.

News December 13, 2025

జుట్టుకు బలాన్నిచ్చే విటమిన్లివే..!

image

ప్రస్తుతకాలంలో కాలుష్యం, వాతావరణ మార్పుల వల్ల చాలామంది హెయిర్ ఫాల్‌తో బాధపడుతున్నారు. ఇలా కాకుండా ఉండాలంటే ఆహారంలో ఈ విటమిన్లుండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు. విటమిన్ బి7, విటమిన్ డి, ఐరన్, జింక్, విటమిన్ ఈ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఏ ఆహారంలో చేర్చుకోవాలి. వీటితో పాటు జీవనశైలి మార్పులు, వ్యాయామం, తగినంత నీరు తాగడం వంటివి చేస్తే పట్టులాంటి జుట్టు సొంతమవుతుందంటున్నారు.

News December 13, 2025

పసుపులో ఆకుమచ్చ తెగులు – నివారణ

image

ఆకుమచ్చ తెగులు సోకిన పసుపు ఆకులపై చిన్నచిన్న పసుపు రంగు మచ్చలు ఏర్పడి అవి గోధుమ మచ్చలుగా మారతాయి. తెగులు తీవ్రమైతే ఆకు మాడిపోతుంది. దుంపలు, కొమ్ములు, మొక్కల ఎదుగుదల లోపించి దిగుబడి, నాణ్యత తగ్గుతుంది. ఈ తెగులు కట్టడికి లీటరు నీటికి మాంకోజెట్ 2.5 గ్రాములు లేదా కార్బండిజమ్ 1 గ్రాము లేదా ప్రోపికోనజోల్ 1mlను 0.5ml జిగురుతో కలిపి 15 రోజల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.