News November 23, 2024
కాంగ్రెస్ ఫ్లాప్ షో.. ‘INDIA’పై ఎఫెక్ట్ తప్పదా?
దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ ఫ్లాప్ షో కొనసాగిస్తోంది. మహారాష్ట్రలో 101 స్థానాల్లో పోటీ చేసి 18, ఝార్ఖండ్‌లో 30 చోట్ల బరిలో నిలిచి 15 స్థానాలకు పరిమితమైంది. ఇటీవల హరియాణా, అంతకుముందు రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే తీరు. ఇకపై INDIAలో కాంగ్రెస్ మాట చెల్లుబాటు కాదని, ఆ కూటమే గల్లంతైనా ఆశ్చర్యం లేదని విశ్లేషకుల అంచనా. ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటుకు ప్రయత్నాలు సాగొచ్చని పేర్కొంటున్నారు.
Similar News
News November 23, 2024
రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, CM దిగ్భ్రాంతి
AP: అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు <<14688076>>ప్రమాదంలో<<>> మృతుల సంఖ్య ఏడుకు చేరింది. గార్లదిన్నె మం. కలగాసుపల్లె వద్ద ఆర్టీసీ బస్సు 12 మంది కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఘటనాస్థలంలో ఇద్దరు, ఆస్పత్రిలో ఐదుగురు మరణించారు. ఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
News November 23, 2024
కేంద్ర మంత్రి వర్గంలోకి శిండే?
మహారాష్ట్రలో మహాయుతి భారీ విజయం సాధించడంతో CM పీఠంపై ఉత్కంఠ నెలకొంది. కూటమిలో అత్యధికంగా 132 సీట్లలో ముందంజలో ఉన్న BJP CM పదవిని వదులుకోకపోవచ్చు. దీంతో ఏక్‌నాథ్ శిండే, అజిత్ పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో శిండేకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని BJP యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అజిత్‌ను మాత్రం Dy.CMగా కొనసాగించవచ్చని సమాచారం.
News November 23, 2024
ప్రియాంక గురించి ఇందిరా గాంధీ మాటల్లో
ప్రియాంకా గాంధీ గురించి ఇందిరా గాంధీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 1984లో తన హత్యకు 2 రోజుల ముందు సెక్రటరీతో ఇందిరా గాంధీ మాట్లాడుతూ ‘నేను ఎక్కువ రోజులు బతక్కపోవచ్చు. కానీ మీరు ప్రియాంక ఎదుగుదలను చూస్తారు. ప్రజలు ఆమెలో నన్ను చూసుకుంటారు. ఆమెను చూసినప్పుడు నన్ను గుర్తు చేసుకుంటారు. ప్రియాంక ఎంతో సాధిస్తుంది. తరువాతి శతాబ్దం ఆమెదే. ప్రజలు నన్ను మరిచిపోతారు’ అని వ్యాఖ్యానించారు.