News April 13, 2024
కాంగ్రెస్ 4 నెలల్లో రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లింది: హరీశ్

TG: కేసీఆర్ అభివృద్ధి బాట పట్టించిన రాష్ట్రాన్ని కాంగ్రెస్ 4 నెలల్లోనే వెనక్కి తీసుకెళ్లిందని MLA హరీశ్‌రావు విమర్శించారు. ‘కాంగ్రెస్ ఫేక్ వార్తలను నమ్ముకుని రాజ్యం నడుపుతోంది. వాటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత యువతపై ఉంది. కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న BJP ప్రజలకు చేసిందేమీ లేదు. నల్లచట్టాలు తెచ్చి 700 మంది రైతుల ప్రాణాలు తీసింది. నిరుద్యోగం, పేదరికం పెరిగింది.’ అని అన్నారు.
Similar News
News December 8, 2025
CBSE తరహాలో టెన్త్ ఎగ్జామ్స్?.. షెడ్యూల్‌పై ఉత్కంఠ

TG: CBSE తరహాలో పిల్లలపై ఒత్తిడి తగ్గించేందుకు ఈసారి SSC పరీక్షల్లో ఒక్కో పేపర్‌కు 2, 3 రోజులు గ్యాప్ ఉంచి 2 రకాల షెడ్యూళ్లను CMOకు పంపారు. మధ్యలో రంజాన్, ఉగాది, మహవీర్ జయంతి, శ్రీరామ నవమి ఉండడంతో 4 రోజుల వ్యవధీ ఉండనుంది. ఈ ప్రతిపాదనలపై CM నిర్ణయం తీసుకోకపోవడంతో పరీక్ష తేదీలపై ఉత్కంఠ నెలకొంది. ఇంటర్ షెడ్యూల్ వెలువడిన వారంలోగా టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ రావాల్సి ఉండగా నెలరోజులవుతున్నా తేలలేదు.
News December 8, 2025
ప్రధాని ప్రసంగంలో నిజాలు కరవయ్యాయి: ప్రియాంకా గాంధీ

ముఖ్యమైన సమస్యల నుంచి డైవర్ట్ చేయడానికే వందేమాతరంపై చర్చ అని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ విమర్శించారు. ‘వందేమాతరం కేవలం గేయం కాదు అది ప్రజల గొంతుక. ప్రధాని ప్రసంగంలో నిజాలు కరవయ్యాయి. వేల మంది మరణిస్తున్నారు. త్వరలో బెంగాల్‌లో ఎన్నికలు ఉన్నాయి. వాటిపై చర్చను వదిలేసి ఈ సమయంలో జాతీయ గేయంపై చర్చ అవసరమా?’ అని లోక్‌సభలో ప్రియాంక పేర్కొన్నారు.
News December 8, 2025
వ్యక్తిత్వ హక్కులు కాపాడాలంటూ హైకోర్టుకు జూ.ఎన్టీఆర్

ఈ-కామర్స్, SMలో తన పర్సనాలిటీ రైట్స్‌ను కాపాడాలని కోరుతూ జూ.ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం 2021 ఐటీ నిబంధనల ప్రకారం నిందితులపై చర్యలు తీసుకోవాలని సదరు SM ప్లాట్‌ఫామ్‌లను ఆదేశించింది. డిసెంబర్ 22న సవివరమైన ఆదేశాలు జారీ చేస్తామంటూ అదే రోజుకు తదుపరి విచారణను వాయిదా వేసింది. కాగా SMలో ట్రోలింగ్‌పై గతంలో నాగార్జున కూడా ఢిల్లీ HCని ఆశ్రయించారు.


