News November 16, 2024
పన్నూ హత్యకు కుట్ర.. వికాస్‌పై కేసు పెట్టిన న్యాయాధికారిపై ట్రంప్ వేటు
ఖలిస్థానీ తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర చేశారని వికాస్ యాదవ్‌పై కేసు నమోదు చేసిన ఫెడరల్ ప్రాసిక్యూటర్ Damian Williamsను ట్రంప్ తొలగించారు. అతని స్థానంలో డిస్ట్రిక్ట్ అటార్నీగా SES మాజీ ఛైర్మన్ జే క్లేటన్‌ను నామినేట్ చేశారు. పన్నూ హత్యకు భారత నిఘా విభాగం EX అధికారి వికాస్ కుట్ర చేశారని US న్యాయ శాఖ ఆరోపిస్తోంది. అయితే వికాస్‌తో ఎలాంటి సంబంధం లేదని భారత్ స్పష్టం చేసింది.
Similar News
News December 11, 2024
మహ్మద్ షమీ ఆసీస్ టూర్ క్యాన్సిల్?
టీమ్ ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లడం లేదని తెలుస్తోంది. ఆయన 5 రోజుల మ్యాచ్ ఆడేంత ఫిట్‌నెస్ సాధించలేదని, అందుకే ఈ టూర్‌ను రద్దు చేసుకున్నట్లు సమాచారం. SMATలో భాగంగా బరోడాతో జరగబోయే క్వార్టర్ ఫైనల్లో ఆయన ఆడతారని తెలుస్తోంది. ఇందులో ఆయన ఫిట్‌నెస్‌ను మరోసారి పరీక్షిస్తారని సమాచారం. కాగా చివరి మూడు టెస్టుల కోసం షమీ ఆసీస్ వెళ్తారని ఇప్పటివరకు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
News December 11, 2024
STOCK MARKETS: బ్యాంకు, ఫైనాన్స్ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్
స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ఆరంభమయ్యాయి. నిఫ్టీ 24,625 (+12), సెన్సెక్స్ 81,536 (+27) వద్ద చలిస్తున్నాయి. బ్యాంకు నిఫ్టీ 53,396 (-181) వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ ADV/DEC రేషియో 30:19గా ఉంది. బ్యాంకు, ఫైనాన్స్ రంగాల్లో సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. ఆటో, మీడియా, రియాల్టి, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లకు డిమాండ్ పెరిగింది. HCLTECH, ICICIBANK, DRREDDY, HDFC ANK, WIPRO టాప్ లూజర్స్. అల్ట్రాటెక్ 2.21% ఎగిసింది.
News December 11, 2024
బంగ్లా హిందువులకు మద్దతుగా కెనడాలో ఆందోళన
బంగ్లాదేశ్ హిందువులకు కెనడా హిందువులు అండగా నిలిచారు. ఆ దేశంలో మైనారిటీలకు రక్షణ కల్పించాలంటూ ఒట్టావాలోని బంగ్లా హైకమిషన్ ముందు ఆందోళన చేపట్టారు. ‘షేమ్ షేమ్ బంగ్లాదేశ్’, ‘మహ్మద్ యూనస్ కూనీకోర్’, ‘హిందూలైవ్స్ మ్యాటర్’, ‘హిందువుల ఊచకోత ఆపండి’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ‘హిందూ స్త్రీలు, పిల్లలను రేప్ చేస్తున్నారు. గతంలో పాక్, అఫ్గాన్‌లో జరిగినట్టే బంగ్లాలోనూ జరుగుతోంది’ అని ఒకరు వాపోయారు.