News August 23, 2024

సీఎం రేవంత్ రెడ్డికి కోర్టు నోటీసులు

image

TG: పరువునష్టం కేసులో సెప్టెంబర్ 25న కోర్టుకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు నోటీసులు ఇచ్చింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ రేవంత్ నిరాధార ఆరోపణలు చేశారని ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసును త్వరగా విచారించాలన్న హైకోర్టు ఆదేశాలతో నాంపల్లి కోర్టు CMకు సమన్లు ఇచ్చింది.

Similar News

News January 20, 2026

కొత్తగూడెం: శిశువు మృతి.. బంధువుల ఆందోళన

image

కొత్తగూడెం ప్రైవేట్ ఆసుపత్రిలో ఘోరం జరిగింది. అప్పుడే పుట్టిన శిశువు మృతి చెందిందని ఆసుపత్రి ముందు బంధువులు బైఠాయించారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, సీఐ శివ ప్రసాద్, ఎస్ఐ విజయ కుమారి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News January 20, 2026

నితీష్ ఫెయిలైనా అవకాశాలివ్వాలి: ఇర్ఫాన్ పఠాన్

image

NZతో జరిగిన మూడో వన్డేలో నితీష్ కుమార్ రెడ్డి హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నారు. దీనిపై స్పందించిన ఇర్ఫాన్ పఠాన్ నితీష్‌ను హార్దిక్ పాండ్యాకు సరైన బ్యాకప్‌గా అభివర్ణించారు. 135km వేగంతో బౌలింగ్, భారీ షాట్లు కొట్టగల బ్యాటింగ్ సామర్థ్యం అతనికి ఉందన్నారు. వరుసగా ఫెయిలైనా మరిన్ని అవకాశాలివ్వాలని సూచించారు. కోహ్లీతో కలిసి నితీష్ నెలకొల్పిన 88 పరుగుల భాగస్వామ్యం అతని టాలెంట్‌కు నిదర్శనమని పేర్కొన్నారు.

News January 19, 2026

రేపు ఆటోల బంద్.. క్లారిటీ

image

TG: రాష్ట్రంలో మంగళవారం ఆటోల బంద్‌ లేదని స్టేట్ టాక్సీ & ఆటో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పెంటయ్యగౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన రూ.12 వేల ప్రోత్సాహకాన్ని వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. బైక్ ట్యాక్సీలను రద్దు చేయాలనే డిమాండ్‌తో త్వరలోనే ఉద్యమం చేపడతామన్నారు. ఆటో డ్రైవర్లను మోసం చేసిన కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్తామని హెచ్చరించారు.