News May 14, 2024

జగన్ విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి

image

AP: సీఎం జగన్ విదేశీ పర్యటనకు CBI కోర్టు అనుమతించింది. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు ఆయన కుటుంబంతో కలిసి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ వెళ్లనున్నారు. కాగా విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతు సడలించాలని జగన్ నాంపల్లి సీబీఐ కోర్టులో దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. వాదనలు విన్న న్యాయమూర్తి ఇటీవల తీర్పును రిజర్వ్ చేశారు. ఇవాళ తీర్పు వెలువరించారు.

Similar News

News December 16, 2025

BREAKING: భారత ప్లేయర్ విధ్వంసం.. డబుల్ సెంచరీ

image

U-19 ఆసియా కప్‌లో భాగంగా మలేషియాతో మ్యాచ్‌లో భారత ప్లేయర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. అభిజ్ఞాన్ 121 బంతుల్లో డబుల్ సెంచరీ చేశారు. ఇందులో 16 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. 48వ ఓవర్‌లో అభిజ్ఞాన్, చౌహాన్ 29 పరుగులు బాదారు. వరుసగా 4, వైడ్, 6, 6, 6, వైడ్, 1, 4 రన్స్ వచ్చాయి.

News December 16, 2025

బీట్ రూట్ సాగులో కలుపు నివారణ ఎలా?

image

బీట్ రూట్‌లో కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి. విత్తిన 24-48 గంటల్లోపు ఎకరాకు తేలిక నేలల్లో 200 లీటర్ల నీటిలో పెండిమిథాలిన్ 1.25 లీటర్లు, అదే బరువు నేలల్లో అయితే 200 లీటర్ల నీటిలో అలాక్లోర్ 1.25L కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 15 రోజులకు 200 లీటర్ల నీటిలో మెట్రిబుజిన్ 300 గ్రా. కలిపి పిచికారీ చేయాలి. గింజ మొలకెత్తిన 20-25 రోజుల తర్వాత కలుపు తీసి మన్ను ఎగదోస్తే గడ్డ బాగా ఊరుతుంది.

News December 16, 2025

99 పైసలకు భూములిస్తామంటే ఎగతాళి చేశారు: లోకేశ్

image

AP: అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడమే తమ లక్ష్యమని మంత్రి లోకేశ్ చెప్పారు. ఐటీ కంపెనీలన్నీ విశాఖకే వస్తున్నాయని తెలిపారు. CM CBN విజన్‌తో ముందుకెళ్తున్నారని చెప్పారు. భోగాపురంలో AAD ఎడ్యుసిటీ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘కొంత మంది విజన్‌లెస్ మనుషులు విజనరీలను విమర్శిస్తారు. 99 పైసలకు భూములిస్తామంటే ఎగతాళి చేశారు. ఆ నిర్ణయంతోనే కాగ్నిజెంట్, TCS వచ్చాయి’ అని వెల్లడించారు.