News April 25, 2024

తెగ గీకేశారు.. మార్చిలో గరిష్ఠానికి క్రెడిట్ కార్డుల ఖర్చు

image

దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం రికార్డ్ స్థాయికి చేరింది. మార్చిలో ఈ కార్డుల ద్వారా ఖర్చు చేసిన మొత్తం రూ.1,64,586 కోట్లకు చేరింది. 2023 మార్చితో (రూ.1,37,310కోట్లు) పోలిస్తే 20% ఎక్కువ. ఆన్‌లైన్‌లో రూ.1,04,081 కోట్లు, ఆఫ్‌లైన్‌లో రూ.60,378 కోట్లు ఖర్చు చేశారు. క్రెడిట్ కార్డు ఆన్‌లైన్ చెల్లింపులు నెల వ్యవధిలో 10% పెరిగాయి. ఫిబ్రవరిలో రూ.94,774కోట్లుగా ఉన్న మొత్తం MARకి రూ.లక్షకోట్లు దాటింది.

Similar News

News April 18, 2026

డీ‘లిటిగేషన్’.. గెలిచిందెవరు?

image

131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో <<19674859>>వీగిపోవడం<<>> తమ విజయమని ప్రతిపక్షాలు అంటున్నాయి. డీలిమిటేషన్ అంశాన్ని ముడిపెట్టడంతోనే మహిళా బిల్లు గట్టెక్కలేదని, ఇది ప్రజాస్వామ్య గెలుపు అని చెబుతున్నాయి. BJP మాత్రం మహిళా కోటాకు ప్రతిపక్షాలు వ్యతిరేకమని ప్రజల్లోకి వెళ్తోంది. ఈ ప్రభావం బెంగాల్, TN ఎన్నికల్లో ఉంటుందని భావిస్తోంది. అందుకే సంఖ్యా బలం లేకున్నా బిల్లు పెట్టిందనే చర్చ సాగుతోంది. దీనిపై మీ కామెంట్.

News April 18, 2026

వచ్చే సీజన్‌కు KKR కోచ్‌గా మెక్‌కల్లమ్: పీటర్సన్

image

వచ్చే సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ కోచ్‌గా బ్రెండన్ మెక్‌కల్లమ్ వస్తారని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ అంచనా వేశారు. ఇది జరుగుతుందని ధీమా వ్యక్తం చేస్తూ తన ట్వీట్‌ను బుక్ మార్క్ చేసుకోవాలని పేర్కొన్నారు. ఇంగ్లండ్ హెడ్ కోచ్‌గా 2022 నుంచి మెక్‌కల్లమ్ కొనసాగుతున్నారు. గతంలో KKRకు ఆడారు. మరోవైపు KKR పేలవ <<19678736>>ప్రదర్శన<<>> కొనసాగుతోంది. ఒక్క గెలుపూ లేక పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.

News April 18, 2026

సభకు నేనొచ్చా.. వాళ్లు రాలేదు: రాఘవ్ చడ్ఢా

image

రాజ్యసభకు గైర్హాజరైన సొంత పార్టీ నేతలపై ఎంపీ రాఘవ్ చడ్ఢా విమర్శలు చేశారు. ‘మా పార్టీ సభా పక్షనేత ఇక్కడ లేరు. కొత్తగా నియమితులైన డిప్యూటీ లీడర్‌ కూడా రాలేదు. నన్ను డిప్యూటీ లీడర్ పదవి నుంచి ఇటీవల తొలగించారు. నేను సభకు వచ్చాను. మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినందుకు థాంక్స్’ అని అన్నారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా మరోసారి నియమితులైన హరివంశ్ సింగ్‌కు అభినందనలు తెలిపారు.