News March 27, 2024
మళ్లీ YCPలోకి క్రికెటర్ అంబటి రాయుడు?

క్రికెటర్ అంబటి రాయుడు చేసిన తాజా ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ‘సిద్ధం!!’ అని రాయుడు పోస్ట్ చేశారు. నేటి నుంచి వైసీపీ అధినేత, సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే రాయుడు ‘సిద్ధం’ అని పోస్ట్ చేయడంతో మళ్లీ వైసీపీలోకి వస్తారా? అనే చర్చ మొదలైంది. కాగా, గతేడాది DECలో వైసీపీలో చేరిన రాయుడు.. జనవరి 7న రాజీనామా చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్‌ను కలిశారు.
Similar News
News February 19, 2026
ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌లో 43 పోస్టులు.. అప్లై చేశారా?

ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (<
News February 19, 2026
వరి మాగాణి మినుములో ఎండు తెగులు

ఎండు తెగులు ఆశించిన మినుము మొక్కలు వడలి, ఎండి పంటకు నష్టం వాటిల్లుతుంది. భూమిలోని శిలీంధ్రం ద్వారా ఈ తెగులు వ్యాపిస్తుంది. దీని నివారణకు పంట మార్పిడితో పాటు పొలంలో నీరు నిల్వలేకుండా చూడాలి. పైరు విత్తే ముందు kg విత్తనానికి 3గ్రా. కార్బెండజిమ్ పట్టించి విత్తాలి. ఎకరాకు 80kgల చివికిన పశువుల ఎరువు+20kgల వేపపిండిలో 2kgల ట్రైకోడెర్మావిరిడె జీవశిలీంధ్రాన్ని కలిపి విత్తే సమయంలో భూమిలో కలియదున్నుకోవాలి.
News February 19, 2026
పూజా సమయంలో చేతికి కంకణం ఎందుకు?

ఇందుకు ఆధ్యాత్మిక, ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పురుషులు కుడి, స్త్రీలు ఎడమచేతికి దీనిని కట్టుకుంటారు. ఇది ధరించడం వల్ల ‘నేను వ్రతం చేస్తున్నాను’ అనే సంకల్పం దృఢపడి మనసు ఏకాగ్రతతో ఉంటుంది. శాస్త్రీయంగా చూస్తే, మణికట్టు వద్ద ఉండే జీవనాడిపై కలిగే ఒత్తిడి వల్ల రక్తప్రసరణ, హృదయస్పందన క్రమబద్ధం అవుతాయి. పసుపు రాసిన నూలుదారం క్రిమిసంహారిణిగా పనిచేస్తుంది. ఆధ్యాత్మిక శక్తిని శరీరంలోకి ప్రసరింపజేస్తుంది.


