News March 26, 2024
దంచికొట్టిన దూబే.. భారీ స్కోరు చేసిన CSK

గుజరాత్‌తో మ్యాచ్‌లో చెన్నై అదరగొట్టింది. GT ముందు 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. CSK ఓపెనర్లు రుతురాజ్, రచిన్ చెరో 46 పరుగులతో చెలరేగి జట్టుకు శుభారంభాన్ని ఇచ్చారు. తర్వాత వచ్చిన రహానే 12 పరుగులకే ఔట్ అయ్యి నిరాశపరిచినా దూబే ధనాధన్ బ్యాటింగ్‌తో అలరించారు. 23 బంతుల్లోనే 51 పరుగులు చేశారు. దీంతో చెన్నై 20 ఓవర్లలో 206 రన్స్ చేసింది. CSK బ్యాటర్ల హిట్టింగ్ ముందు GT బౌలర్లు తేలిపోయారు.
Similar News
News February 11, 2026
అమరావతి ఏపీకి శాశ్వత రాజధాని: గవర్నర్

AP: అమరావతి రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా ఉంటుందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. ‘క్వాంటం టెక్నాలజీ ద్వారా అమరావతిని గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు సంకల్పించాం. అమరావతి భవిష్యత్తును నాశనం చేసే ఉద్దేశంతో గత ప్రభుత్వం 3 రాజధానుల ప్రతిపాదన తెచ్చింది. శ్వేతపత్రాల ద్వారా మా ప్రభుత్వం వాటిని ఎండగట్టింది. రాష్ట్ర GSDP రూ.15.91లక్షల కోట్ల నుంచి రూ.17.60లక్షల కోట్లకు పెరిగింది’ అని పేర్కొన్నారు.
News February 11, 2026
కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 5 సీనియర్ మేనేజర్, మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గలవారు మార్చి 12 వరకు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి CA, CMA, CS, ICSI మెంబర్ షిప్‌తో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ/పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.concorindia.co.in
News February 11, 2026
పితృ దోషంతో పెళ్లికి ఆటంకాలు ఎదురవుతాయా?

జాతకంలో పితృ దోషం ఉన్నప్పుడు సంతానంతో పాటు వివాహం కూడా ఆలస్యమవుతుంది. పూర్వీకుల ఆశీస్సులు లేకపోవడం వల్ల ఎన్ని సంబంధాలు చూసినా ఫలితం ఉండదు. దీనికి పరిష్కారంగా అమావాస్య రోజున పితృ తర్పణాలు వదలాలి. గయ, కాశీ వంటి క్షేత్రాలలో శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తే దోషం తొలగుతుంది. నిరుపేదలకు అన్నదానం చేయాలి. గోసేవ అత్యంత శ్రేష్ఠం. తద్వారా పితృ దేవతలు శాంతించి, త్వరగా పెళ్లి సంబంధం కుదిరేలా అనుగ్రహిస్తారు.


