News May 2, 2024

CT 2025: లాహోర్‌లో భారత్ మ్యాచ్‌లు: పీసీబీ

image

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమ్ ఇండియా తమ మ్యాచ్‌లన్నీ లాహోర్‌లో ఆడొచ్చని PCB ప్రతిపాదించింది. భద్రతాపరంగా గడాఫీ స్టేడియం సురక్షితమైనదని తెలిపింది. అలాగే భారత్ నుంచి వాఘా బోర్డర్ మీదుగా వచ్చే ప్రేక్షకులకు కూడా లాహోర్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్ వెళ్లేదే లేదని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. దుబాయ్ లేదా ఆస్ట్రేలియాలో తమ మ్యాచ్‌లు ఆడాలని భారత్ భావిస్తోంది.

Similar News

News December 17, 2025

విశాఖలో పొగమంచు.. ఉమెన్స్ టీమ్ ఫ్లైట్ డైవర్ట్

image

దేశంలో దట్టమైన పొగమంచు కారణంగా పలు విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడుతోంది. ఉమెన్స్ టీ20 జట్టు సభ్యులతో ముంబై నుంచి విశాఖకు బయల్దేరిన ఫ్లైట్‌ను పూర్ విజిబిలిటీ కారణంగా విజయవాడకు డైవర్ట్ చేశారు. ఈ నెల 21, 23 తేదీల్లో శ్రీలంకతో మ్యాచ్‌ల కోసం మహిళా జట్టు విశాఖకు వెళ్లాల్సి ఉంది. అటు విశాఖ నుంచి శంషాబాద్ వెళ్లాల్సిన మరో విమానం కూడా పొగమంచు కారణంగా క్యాన్సిల్ అయింది.

News December 17, 2025

చేసే పనిలో బాధ్యత, జవాబుదారీతనం ఉండాలి: సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా అధికారులకు CM దిశానిర్దేశం చేశారు. నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలని సూచించారు. పథకాల అమలులో కలెక్టర్లు కీలకంగా ఉంటారని తెలిపారు. మనం ఏం చేశామనే వివరాలు సమగ్రంగా ఉండాలని, నిరంతరం నేర్చుకునే పనిలో ఉండాలని అన్నారు. అనుకున్న సమయానికి లక్ష్యాలు నెరవేరేలా కృషి చేయాలని, జవాబుదారీతనం ఉండాలని పిలుపునిచ్చారు.

News December 17, 2025

రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు!

image

TG: పంచాయతీ ఎన్నికలు ముగుస్తుండటంతో పరిషత్(MPTC, జడ్పీ) ఎలక్షన్స్‌కు ప్రభుత్వం, ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. తాజాగా ఈ ఫైల్‌ను అధికారులు సీఎంకు పంపారు. రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించారు. పంచాయతీ తరహాలోనే రిజర్వేషన్లు ఖరారు చేశారు. సీఎం ఆమోదిస్తే ఈ నెల 25లోపు షెడ్యూల్ విడుదల, JANలో ఎన్నికలు పూర్తి చేసేలా ప్లాన్ చేసినట్లు సమాచారం.