News April 26, 2024

CTR: టీడీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ, టీడీపీలకు రెబల్ పోటు తప్పేలా లేదు. తాజాగా పలమనేరులో TDP రెబల్‌గా దామోదర్ నాయుడు (బుల్లెట్ నాయుడు) నామినేషన్ వేశారు. గత 30 ఏళ్లుగా టీడీపీలో పని చేస్తున్నా.. తనకు ఎవరూ గుర్తింపు ఇవ్వలేదని వాపోయారు. అందుకే టీడీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసినట్లు చెప్పారు. ఇప్పటికే సత్యవేడులో టీడీపీ రెబల్‌గా జేడీ రాజశేఖర్, కుప్పంలో వైసీపీ రెబల్‌గా ఓ మాజీ సర్పంచ్ నామినేషన్ వేశారు.

Similar News

News April 11, 2026

కాణిపాకంలో 14న అర్జిత సేవలు రద్దు

image

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఈనెల 14వ తేదీ తమిళ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు ఆలయ ఈవో పెంచల కిషోర్ తెలిపారు. ఆరోజు ఉదయం ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేయనున్నట్లు చెప్పారు. ఆరోజు ఆలయంలో నిర్వహించే అన్ని అర్జిత సేవలు రద్దు చేయబడ్డాయని, భక్తులు సహకరించాలని కోరారు.

News April 11, 2026

చిత్తూరు జిల్లాలో తనిఖీలు

image

చిత్తూరు ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. కార్వేటినగరం మండలంలో 200 లీటర్ల సారా ఊట ధ్వంసం చేశారు. చిత్తూరు పట్టణ పరిధిలో కారు, మూడు బైకులను సీజ్ చేశారు. నేరాలను ముందస్తుగా అరికట్టి, ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడమే ఈ తనిఖీల లక్ష్యమని అధికారులు తెలిపారు.

News April 11, 2026

చిత్తూరు జిల్లా టీచర్లకు గమనిక

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని జడ్పీ, మండల పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న ఎస్జీటీ, సమానమైన కేటగిరి టీచర్లకు ప్రమోషన్ సీనియారిటీ జాబితా సిద్ధమైంది. విద్యాశాఖ వెబ్‌సైట్‌లో సబ్జెక్టుల వారీగా పొందుపరిచామని డీఈవో రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. వీటిపై అభ్యంతరాలను సరైన ఆధారాలతో ఎంఈవో ద్వారా ఈనెల 16వ తేదీలోపు డీఈవో కార్యాలయానికి చేర్చాలని ఆయన సూచించారు.