News March 27, 2024

దమ్ముంటే లోకేశ్, బాబు నాపై పోటీ చేయాలి: కొడాలి నాని

image

AP: టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌కు దమ్ముంటే తనపై గుడివాడలో పోటీ చేయాలని మాజీ మంత్రి కొడాలి నాని సవాల్ విసిరారు. ‘నాకు భయపడి గంటకో వ్యక్తిని పోటీకి దింపుతున్నారు. ఇప్పుడు అమెరికా నుంచి వచ్చిన వ్యక్తిని పోటీకి పెట్టారు. ఈసారి అంతరిక్షం నుంచి తీసుకొస్తారేమో? చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా నన్ను ఓడించలేరు. ఎంతమంది వచ్చినా గుడివాడలో ఐదోసారి గెలవబోతున్నా’ అని ఆయన తెలిపారు.

Similar News

News February 10, 2026

డిజిటల్ లావాదేవీల పై అప్రమత్తత అవసరం: కలెక్టర్

image

ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన పొందాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. RBI ఫిబ్రవరి 9 నుంచి 13వ వరకు నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం పోస్టర్లను కలెక్టర్ మంగళవారం ఆవిష్కరించారు. ప్రజలు సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో ఆర్థిక అక్షరాస్యత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సురక్షిత బ్యాంకింగ్ విధానాలు పాటించడం, డిజిటల్ లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించుకోవడం అలవాటు చేసుకోవాలన్నారు.

News February 10, 2026

బంగ్లాదేశ్‌లో హిందూ వ్యాపారి హత్య

image

బంగ్లాదేశ్‌లో మైనార్టీల హత్యలు కొనసాగుతున్నాయి. మిమెన్‌సింగ్ జిల్లాలో హిందూ వ్యాపారి సుసేన్ చంద్ర సర్కార్‌ను దుండగులు కత్తితో పొడిచి హత్య చేశారు. దక్షిణకందా గ్రామానికి చెందిన సర్కార్ దగ్గరలోని బోగర్ బజార్‌లో బియ్యం వ్యాపారం చేస్తున్నారు. హత్య తర్వాత షాపులో నుంచి లక్షల రూపాయలను దొంగిలించినట్టు పోలీసులు తెలిపారు. రెండు రోజుల్లో జాతీయ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజా హత్య కలకలం రేపుతోంది.

News February 10, 2026

రంజాన్ మాసం.. ముస్లిం ఉద్యోగులకు గుడ్ న్యూస్

image

AP: రంజాన్ మాసం సందర్భంగా ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉపవాసాల నేపథ్యంలో ఒక గంట ముందే ఇంటికి వెళ్లేందుకు అనుమతించింది. ఈనెల 18 నుంచి మార్చి 19 వరకు ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ ఉద్యోగులు డ్యూటీ నుంచి ఒక గంట ముందే ఇంటికి వెళ్లొచ్చని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.