News March 6, 2025

DAVID MILLER: ఓడినా వణికించాడు..!

image

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో సౌతాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ ఫైటింగ్ సెంచరీతో న్యూజిలాండ్‌ను వణికించాడు. ఇలా ప్రత్యర్థులను భయపెట్టడం మిల్లర్‌కు ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటి సుడిగాలి ఇన్నింగ్సులు ఆడారు. తన వన్ మ్యాన్ ఆర్మీ షోతో ప్రత్యర్థులను భయపెట్టారు. 2013 CT సెమీస్, 2014 T2O సెమీస్, 2015 WC సెమీస్, 2023 WC సెమీస్‌లోనూ విధ్వంసకర ఇన్నింగ్సులు ఆడారు. కానీ తన జట్టును ఫైనల్‌కు చేర్చలేకపోయారు.

Similar News

News December 12, 2025

డెలివరీ కోసమే అయితే వీసాలివ్వం: US ఎంబసీ

image

తమ దేశ పౌరసత్వం కల్పించడంపై అమెరికా మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. USలో బిడ్డకు జన్మనివ్వడానికి టూరిస్ట్ వీసాకు అప్లై చేస్తే నిరాకరించనున్నట్లు INDలోని US ఎంబసీ తెలిపింది. USలో జన్మిస్తే సహజ సిద్ధంగా పౌరసత్వం వస్తుందని కొందరు ప్రయత్నిస్తారని, ఆ అడ్డదారులను మూసేస్తున్నట్లు తెలిపింది. పౌరసత్వం కోసం ప్రయత్నిస్తున్నట్లు సూచన ప్రాయంగా తెలిసినా అలాంటి వీసా దరఖాస్తులను తిరస్కరించనున్నట్లు చెప్పింది.

News December 12, 2025

ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

image

AP: అల్లూరి జిల్లాలో జరిగిన ఘోర బస్సు <<18539107>>ప్రమాదంపై<<>> సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. అన్ని శాఖల అధికారులు తక్షణమే ఘటనాస్థలానికి వెళ్లాలని సీఎం ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

News December 12, 2025

మహిళల్లో ఐరన్ లోపం లక్షణాలివే..

image

మహిళల్లో ఐరన్ లోపం ఉంటే అలసట, బలహీనత ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జుట్టు ఎక్కువగా రాలడం కూడా ఐరన్ లోపానికి సంకేతాలే. దీన్ని తగ్గించడానికి పాలకూర, బీట్‌రూట్, పప్పులు, మాంసం, గుడ్లు, డ్రై ఫ్రూట్స్, విత్తనాలు తీసుకోవాలి. అలాగే టమిన్-సి ఐరన్ శోషణకు సహాయపడుతుంది. నారింజ, నిమ్మకాయ, ద్రాక్ష, స్ట్రాబెర్రీ వంటి ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు.