News March 8, 2025
15వ రోజు.. ఇప్పటికీ లభించని ఆచూకీ

SLBC టన్నెల్‌లో 8 మంది కార్మికులు చిక్కుకొని ఇవాళ్టికి 15 రోజులు అవుతోంది. అత్యంత కఠిన పరిస్థితుల మధ్య శతవిధాలా ప్రయత్నిస్తున్నా ఇప్పటివరకు వారి ఆచూకీ లభించలేదు. నిన్నటి నుంచి కేరళకు చెందిన క్యాడవర్ డాగ్స్‌ను రంగంలోకి దించారు. బెల్జియన్ మాలినోస్ జాతికి చెందిన ఈ శునకాలు 15మీటర్ల లోతులో ఉన్న మానవ అవశేషాలను కూడా గుర్తించగలవు. దీంతో అధికారులు ఆశలన్నీ వీటిపైనే పెట్టుకున్నారు.
Similar News
News March 21, 2025
EPFO నూతన ఉద్యోగుల వివరాలు తెలిపిన కార్మిక శాఖ

ఈ ఏడాది జనవరిలో ఈపీఎఫ్‌ఓలో నికరంగా 17.89లక్షల మంది నూతన చందాదారులు చేరినట్లు కేంద్ర కార్మిక శాఖ వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఇది 11.47శాతం అధికమని తెలిపింది. కొత్తగా చేరిన వారిలో18-25 ఏళ్లవారు దాదాపు 4.7 లక్షలమంది ఉన్నారు. జనవరిలో కొత్తగా చేరిన మహిళా సభ్యులు 2.17 లక్షల మంది ఉండగా గతేడాదితో పోలిస్తే 6.10 శాతం పెరిగారు.
News March 21, 2025
శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు ఫ్యామిలీ

AP: సీఎం చంద్రబాబు ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. మనవడు దేవాన్ష్ జన్మదినం సందర్భంగా ఇవాళ అన్నప్రసాద వితరణ చేయనున్నారు. మంత్రి లోకేశ్‌తో సహా కుటుంబసభ్యులంతా నిన్న రాత్రి పద్మావతి గెస్ట్ హౌజ్‌కు చేరుకున్నారు. ఆయనకు టీటీడీ ఛైర్మన్, ఈవో స్వాగతం పలికారు. అన్నప్రసాదాలు తీసుకోవడంతో పాటు భక్తులకు వడ్డించనున్నారు.
News March 21, 2025
నేటి నుంచి టెన్త్ పరీక్షలు.. ఈసారి కొత్త విధానం

TG: నేటి నుంచి రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,650 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 5,09,403 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయనున్నారు. ఉ.9.30 గంటలకు పరీక్షలకు ప్రారంభం కానుండగా 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. తొలిసారిగా 24 పేజీల బుక్ లెట్ ఇవ్వనున్నారు. ఎలాంటి అడిషనల్ పేజీలు ఇవ్వబోమని అధికారులు స్పష్టం చేశారు. ALL THE BEST.