News March 31, 2024
DAY-2.. శ్రీపాద వల్లభ సంస్థానంలో జనసేనాని

కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీపాద శ్రీ వల్లభ సంస్థానంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జనసేనానికి శ్రీ వల్లభ సంస్థానం నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అర్చక స్వాములు పవన్‌తో పూజలు చేయించిన అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. 2వ రోజు ప్రచారంలో భాగంగా పవన్ బయలుదేరగా.. ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. వారికి పవన్ అభివాదం చేశారు.
Similar News
News February 13, 2026
రాజమండ్రి: అరినా-3 పూర్తి చేయాలి.. కేంద్రమంత్రికి పురందేశ్వరి వినతి

రాజమండ్రి వి.ఎల్ పురంలోని అరినా-3 క్రీడా సముదాయాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి కోరారు. ఈ మేరకు కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. నగర యువతకు ఆధునిక క్రీడా వసతులు కల్పించడంతో పాటు, రాబోయే గోదావరి పుష్కరాల సమయంలో ఈ ప్రాజెక్ట్ బహుళ ప్రయోజనకారిగా మారుతుందని ఆమె పేర్కొన్నారు.
News February 13, 2026
సీఎం చంద్రబాబుతో ఎమ్మెల్యే బత్తుల భేటీ

సీఎం చంద్రబాబుతో రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల అనంతరం భేటీ అయ్యారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలతో కూడిన వినతి పత్రాన్ని సీఎంకు అందించారు. 2027 పుష్కరాలకు రాజానగరం నియోజకవర్గానికి ప్రాధాన్యత నిచ్చి తగిన నిధులు కేటాయించాలని, సాగు, తాగునీటి ప్రాజెక్టులకు సహకారం అందించాలని కోరారు. వాటిపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు.