News September 12, 2025

అప్పులు ఆంధ్రాలో మాత్రమే పెరగలేదు: బుగ్గన

image

ఆంధ్రప్రదేశ్‌లో అప్పులు పెరిగాయని జనరలైజ్డ్‌గా మాట్లాడటం సరికాదని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. గడచిన పదేళ్లలో కేంద్రం సహా చాలా రాష్ట్రాల్లో అప్పులు పెరిగాయని Way2News కాన్‌క్లేవ్‌లో వెల్లడించారు. అప్పటి కరోనా సహా ఇతర పరిస్థితులతో సరైన ఉపాధి, ఆదాయ అవకాశాలు లేవని తెలిపారు. ఇక విభజన తర్వాత చాలా కీలకమైన మొదటి 5 సంవత్సరాలు ఏ పనినీ సరిగా చేయలేకపోయారని ఆరోపించారు.

Similar News

News December 12, 2025

నటికి క్యాన్సర్.. పాపం ఎలా అయ్యారో చూడండి

image

టాలీవుడ్‌ సహాయ నటి వాహిని రొమ్ము క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను HYDలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ట్రీట్‌మెంట్‌కి సుమారు ₹35లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపినట్లు సమాచారం. విషయం తెలిసిన నటి కరాటే కళ్యాణి SMలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఆమె చికిత్స కోసం ఆర్థిక సాయం చేయాలని కోరారు. అటు వాహిని త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు.

News December 12, 2025

ఘోరం.. బాలిక చెవి కొరుక్కుతిన్న కుక్క

image

AP: నంద్యాల జిల్లా ఆత్మకూరులో 4 ఏళ్ల చిన్నారిపై వీధికుక్క పాశవికంగా దాడి చేసింది. ఆసియా అనే బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా ఒక్కసారిగా దాడి చేసి చెవిని కొరుక్కుతింది. చెంపతో పాటు ఇతర శరీర భాగాలపైనా తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
* పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించండి

News December 12, 2025

9 జిల్లాలతో విశాఖ ఎకనామిక్ రీజియన్

image

AP: VSP ఎకనామిక్ రీజియన్‌‌పై CM CBN సమీక్షించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలు దీని పరిధిలో ఉన్నాయి. APలో 31% విస్తీర్ణం, 23% జనాభాతో GDPలో 30% భాగస్వామ్యం VERదే. గ్లోబల్ పోర్ట్, నెక్ట్స్‌జెన్ ఐటీ, అగ్రికల్చర్, టూరిజం, హెల్త్ కేర్ వంటి 7 గ్రోత్ డ్రైవర్ల ద్వారా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.