News December 1, 2025
DEC 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం: వేణుగోపాల్ రావు

డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయ సముదాయంలోని పరేడ్ గ్రౌండ్‌లో ఉదయం 9 గంటలకు వేడుకలు నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్ రావు ప్రకటించారు. దివ్యాంగుల హక్కులు, సంక్షేమంపై అవగాహన పెంపే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో దివ్యాంగులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
Similar News
News February 18, 2026
VZM: సామాన్యులకు SBI రూ.60 లక్షల ప్రమాద భీమా

సామాన్యుల ఆర్థిక భద్రతే లక్ష్యంగా ప్రభుత్వరంగ సంస్థ SBI తమ ఖాతాదారులకు ‘గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్’ను తెచ్చినట్లు రీజినల్ మేనేజర్ ఎం. సురేశ్ బాబు తెలిపారు. ఏడాదికి రూ.3,000 ప్రీమియంతో రూ.60 లక్షల ప్రమాద బీమా పొందవచ్చన్నారు. ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి బీమాతో పాటు పిల్లల చదువుకు రూ.20 వేలు, అంత్యక్రియలకు రూ.10 వేలు అందుతాయన్నారు. ఖాతాదారులు తమ బ్యాంక్ శాఖను సంప్రదించాలన్నారు.
News February 18, 2026
కామారెడ్డి మెడికల్ కాలేజీలో పోస్టుల భర్తీ

కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో కాంట్రాక్టు ప్రాతిపదికన 53 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ వాల్య తెలిపారు. ఇందులో ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు సీనియర్ రెసిడెంట్ పోస్టులు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 18 నుంచి 21 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 23న వాక్-ఇన్ ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుందని స్పష్టం చేశారు.
News February 18, 2026
స్వల్ప నష్టాల్లో మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప నష్టాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 40 పాయింట్లు కోల్పోయి 83,399 వద్ద, నిఫ్టీ 5 పాయింట్లు నష్టపోయి 25,719 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, HCL టెక్, టీసీఎస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. టాటా స్టీల్, బెల్, ఐటీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.


