News November 30, 2025

DEC 5న ఓటీటీలోకి ‘ది గర్ల్‌ఫ్రెండ్’

image

నేషనల్ క్రష్ రష్మిక, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీ ఓటీటీలోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా డిసెంబర్ 5 నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 7న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.

Similar News

News February 17, 2026

రైళ్ల టాయిలెట్ల శుభ్రతకు ఏఐ టెక్నాలజీ

image

రైళ్లలో అపరిశుభ్రతకు కేరాఫ్ అడ్రస్‌గా టాయిలెట్లు ఉంటాయి. ఈ సమస్య పరిష్కారానికి రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. రిజర్వ్, జనరల్ బోగీల్లోనూ గంటకోసారి శుభ్రం చేసేలా AIని వాడుతోంది. తొలిదశలో 100 రైళ్లలో ప్రారంభించినట్లు చీఫ్ ప్రాజెక్ట్ ఇంజినీర్ లక్ష్మణ్ తెలిపారు. ‘క్లీనింగ్‌కు ముందు, తర్వాత ఫొటోలను మొబైల్ యాప్‌లో సిబ్బంది అప్‌లోడ్ చేయాలి. వాటిలో ఏ మాత్రం తేడా ఉన్నా AI అప్రమత్తం చేస్తుంది’ అని చెప్పారు.

News February 16, 2026

ప్రపంచానికే పరిష్కారాలు చూపుతాం: మోదీ

image

ఢిల్లీ కేంద్రంగా నేటి నుంచి ఈ నెల 20 వరకు జరగనున్న ‘ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో’ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ఆవిష్కర్తలు, పరిశోధకులు, ఔత్సాహికుల మధ్య ఉండటంవల్ల భారతీయ ప్రతిభ, ఏఐ సామర్థ్యం గురించి అవగాహన కలుగుతోంది. అందరం కలిసి మన దేశానికే కాకుండా అనేక సమస్యలపై ప్రపంచానికే పరిష్కారాలను చూపుతాం’ అని రాసుకొచ్చారు.

News February 16, 2026

రోకో.. స్టైల్‌ అదుర్స్

image

టీమ్ ఇండియా దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వయసు పెరుగుతున్నా యంగ్‌గా కనిపిస్తున్నారని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఈ 38, 37 ఏళ్ల స్టార్ ప్లేయర్ల లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. రోహిత్ శర్మ బరువు తగ్గి, ఫిట్‌గా, స్టైలిష్‌గా మారిపోయారు. అటు ఇండియాకు వచ్చిన విరాట్ తనదైన స్వాగ్‌తో అదుర్స్ అనిపించారు.