News May 2, 2024
ఆ రెండు స్థానాలపై నేడు నిర్ణయం: కాంగ్రెస్

ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానాలకు పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్థులపై నేడు స్పష్టత రానుంది. 30 గంటల్లోపు అభ్యర్థులను ప్రకటిస్తామని నిన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలిపారు. రేపటి వరకు సమయం ఉందని.. అభ్యర్థులు ఎవరనే విషయమై చర్చలు జరుగుతున్నాయన్నారు. పార్టీ చీఫ్ ఖర్గే ఒక నిర్ణయానికి వచ్చే వరకు ఎలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు.
Similar News
News December 15, 2025
నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్

H1B, H4(డిపెండెంట్స్) వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం ఇవాళ్టి నుంచి తనిఖీ చేయనుంది. ఈ ప్రక్రియను ‘వెట్టింగ్’గా పిలుస్తున్నారు. దరఖాస్తుదారులంతా SM సెట్టింగులను ప్రైవేటు నుంచి పబ్లిక్ మార్చుకోవాలని US విదేశాంగ శాఖ సూచించింది. ‘ప్రతి వీసా నిర్ణయం నేషనల్ సెక్యూరిటీ కోణంలోనే ఉంటుంది. ఇక్కడికి వచ్చేవాళ్లు దేశ ప్రయోజనాలకు నష్టం కలిగించరని మేం నమ్మాలి’ అని పేర్కొంది.
News December 15, 2025
రబీ సాగు నిరాశాజనకం

APలో రబీ సాగు ఆశించినస్థాయిలో సాగడం లేదు. ఈ సీజన్‌లో 20.70 లక్షల హెక్టార్లలో 22 రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేయగా ఇప్పటి వరకు 6.57 లక్షల హెక్టార్లలో మాత్రమే రైతులు పంటలు వేశారు. మొంథా, దిత్వా తుఫాన్ల కారణంగా ఖరీఫ్ పంటల కోతలు ఆలస్యమవడం ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. కృష్ణా డెల్టా, సాగర్ కుడి కాలువ కింద వరి సాగుకు నీటి గ్యారంటీ లేకపోవడమూ మరో కారణమని పేర్కొంటున్నారు.
News December 15, 2025
పాడి పశువులకు టీకాలు – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వాతావరణ మార్పుల కారణంగా పశువులకు కొన్ని బాక్టీరియా రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే పశువులకు ఆయా సీజన్లకు అనుగుణంగా టీకాలు వేయించాలి. ఆ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ☛ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు(ఉదయం, సాయంత్రం) మాత్రమే టీకాలు వేయించాలి. ☛ వ్యాధి సోకిన పశువులకు ఎట్టి పరిస్థితుల్లోనూ టీకాలు వేయించకూడదు. ☛ ఒక టీకా వేసిన 10-15 రోజుల తర్వాత మాత్రమే ఇంకో టీకా వేయించాలి.


