News June 12, 2024

మంత్రిని ఓడించారు.. మంత్రి అయ్యారు

image

తొలిసారి MLAగా గెలిచిన గుమ్మడి సంధ్యారాణి మంత్రిగా ప్రమాణం చేశారు. గతంలో రెండుసార్లు MLA, ఒకసారి MP అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారామె. 1999లో కాంగ్రెస్ నుంచి, 2009లో TDP నుంచి సాలూరులో MLA అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2014లో అరకు MP అభ్యర్థిగా పోటీ చేస్తే మరోసారి ఓటమే ఎదురైంది. ఈ ఎన్నికల్లో సాలూరులో బరిలో దిగి వైసీపీ అభ్యర్థి, మంత్రి పీడిక రాజన్నదొరపై విజయం సాధించి ఏకంగా మినిస్టర్ అయ్యారు.

Similar News

News March 25, 2025

క్యాన్సర్ బాధితుడి మాటలకు మంత్రి శ్రీధర్ బాబు కన్నీళ్లు

image

పలిమెల మండలం సర్వాయిపేట గ్రామానికి చెందిన నితిన్ క్యాన్సర్‌తో బాధపడుతూ HYDలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంత్రి శ్రీధర్ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి తానున్నానని భరోసా కల్పించారు. ‘సార్.. నేను మంచి క్రికెటర్ కావాలనుకున్నా, క్రికెట్ కిట్ ఇప్పించండి’ అని నితిన్‌ అనడంతో శ్రీధర్ బాబు కన్నీళ్లు పెట్టుకున్నారు. క్రికెట్ కిట్ తెప్పించి అతడి కోరికను తీర్చారు.

News March 25, 2025

NJACపై నిర్ణయం తీసుకోండి: అలహాబాద్ బార్ అసోసియేషన్

image

NJACపై మళ్లీ నిర్ణయం తీసుకోవాలని అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు లేఖ రాసింది. ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు కాలిపోవడం తెలిసిందే. కొలీజియం ఆయన్ను అక్కడి నుంచి తమ హైకోర్టుకు బదిలీ చేయడాన్ని బార్ వ్యతిరేకిస్తోంది. నిర్ణయం వెనక్కి తీసుకోకుంటే సమ్మె చేస్తామని హెచ్చరించింది. జడ్జిల నియామకం కోసం GOVT ఏర్పాటు చేయాలనుకున్న కమిషనే NJAC.

News March 25, 2025

శ్రీరామ నవమికి ముస్తాబవుతున్న అయోధ్య

image

అత్యంత వైభవంగా జరిగే శ్రీరామ నవమి వేడుకలకు అయోధ్య ముస్తాబవుతోంది. ఏప్రిల్ 6న జరిగే శ్రీరాముని కళ్యాణ మహోత్సవాన్ని భక్తులందరూ వీక్షించేలా నగరం మెుత్తం భారీ LED స్క్రీన్లను అధికారులు ఏర్పాటు చేయనున్నారు. ఆశ్రమాలలో వసతి సౌకర్యం కల్పించనున్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్వామివారి కళ్యాణాన్ని దేశవ్యాప్తంగా తిలకించేలా లైవ్ టెలికాస్ట్ చేయనున్నట్లు పేర్కొన్నారు.

error: Content is protected !!