News February 11, 2025

PM ఫ్రాన్స్ పర్యటనలో చేసుకునే రక్షణ ఒప్పందాలివే

image

ఫ్రాన్స్‌నుంచి 26 రఫేల్-ఎం యుద్ధవిమానాలు, 3 స్కార్పీన్ క్లాస్ సబ్‌మెరైన్లను నేవీ కోసం కొనుగోలు చేయాలని భారత్ సూచనప్రాయంగా నిర్ణయించింది. ప్రధాని ఫ్రాన్స్ పర్యటనలో ఈ ఒప్పందం పూర్తికానుంది. ఫైటర్ జెట్స్ ఒప్పందం విలువ రూ.63వేల కోట్లుగా ఉండొచ్చని అంచనా. INS విక్రాంత్, INS విక్రమాదిత్య నౌకలపై వీటిని మోహరించనున్నారు. ఇక 3 సబ్‌మెరైన్ల కొనుగోలు విలువ రూ.33,500 కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా.

Similar News

News March 28, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా
* ఏపీ, టీజీలో అసెంబ్లీ సీట్లు పెంచలేదు: రేవంత్
* ఆరు గ్యారంటీలు నెరవేర్చాకే ఓట్లు అడుగుతాం: శ్రీధర్ బాబు
* రేవంత్ ‘తెలంగాణ బూతుపిత’ అవుతారు: KTR
* AP: పోలవరం నిర్వాసితులకు త్వరలోనే నష్టపరిహారం: CBN
* 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తాం: నిమ్మల
* హిందూ ధర్మంపై మాట్లాడే హక్కు పవన్‌కు లేదు: జగన్

News March 28, 2025

BREAKING: లక్నో చేతిలో SRH ఓటమి

image

IPL-2025: ఈ సీజన్లో SRHకు తొలి ఓటమి ఎదురైంది. ఉప్పల్ స్టేడియంలో SRHపై లక్నో 5 వికెట్ల తేడాతో గెలిచింది. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో.. 16.1 ఓవర్లలోనే సులభంగా లక్ష్యాన్ని ఛేదించింది. పూరన్ 26 బంతుల్లో 6 సిక్సర్లు, 6 ఫోర్లతో 70 రన్స్ చేసి మ్యాచును తమవైపు లాగేశారు. ఓపెనర్ మార్ష్ (52) హాఫ్ సెంచరీతో రాణించారు. కమిన్స్ రెండు వికెట్లు తీశారు.

News March 28, 2025

టెన్త్ అర్హతతో 1,161 ఉద్యోగాలు.. మరో వారమే?

image

సీఐఎస్ఎఫ్ 1,161 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. కానిస్టేబుల్/డ్రైవర్, డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్, డ్రైవర్ ఫర్ సర్వీస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మెట్రిక్యులేషన్‌తోపాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. 18 నుంచి 28 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అర్హులు. జీతం నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉంటుంది. https://cisfrectt.cisf.gov.inలో దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ 3 వరకు అప్లై చేసుకోవచ్చు.

error: Content is protected !!