News February 17, 2025

FEB 20న 4:30PMకి ఢిల్లీ సీఎం ప్రమాణం!

image

ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకార ముహూర్తం ఖరారైనట్టు తెలిసింది. గురువారం సాయంత్రం 4:30కు ప్రధాని మోదీ, HM అమిత్ షా, కేంద్ర మంత్రుల సమక్షంలో రామ్‌లీలా మైదానంలో ఈ వేడుక జరగనుందని సమాచారం. మంత్రివర్గమూ అదే రోజు ప్రమాణం చేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ సీఎం రేసులో పర్వేశ్ వర్మ, రేఖా గుప్తా, ఆశీశ్ సూద్ ముందు వరుసలో ఉన్నారు.

Similar News

News March 11, 2026

ఈ టైమ్‌లో ఎండలో నిలబడండి..

image

భారతదేశంలో సూర్యరశ్మి పుష్కలంగా ఉన్నప్పటికీ మెజారిటీ ప్రజలు విటమిన్-డి లోపంతో సతమతమవుతున్నారు. మీకు 30-100 ng/mL మధ్య ఉంటే డి విటమిన్ సరిపడా ఉందని అర్థం. సహజంగా దీనిని పెంచుకునేందుకు రోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య కనీసం 30 నిమిషాలు ఎండలో ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎముకల పుష్టికి, రోగనిరోధక శక్తికి ఈ ‘సన్ షైన్’ విటమిన్ ఎంతో కీలకమని పేర్కొన్నారు.

News March 11, 2026

2 రోజుల్లో ₹51,400 కోట్ల ఆయుధాలు

image

ఇరాన్ యుద్ధంలో అమెరికా భారీగా ఖర్చు చేస్తోంది. యుద్ధం మొదలైన మొదటి 48 గంటల్లోనే ట్రంప్ యంత్రాంగం సుమారు ₹51,400 కోట్ల విలువైన ఆయుధాలను వాడేసినట్లు సమాచారం. కేవలం క్షిపణులు, బాంబులకే ఇంత ఖర్చు కాగా.. సైనిక మోహరింపు వ్యయం అదనం. ఈ స్థాయిలో ఖర్చు చేయడం అమెరికా కాంగ్రెస్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఇంతటి భారీ ఖర్చుతో కూడిన యుద్ధాన్ని పెంటగాన్ ఎంతకాలం కొనసాగించగలదనే దానిపై చర్చలు మొదలయ్యాయి.

News March 11, 2026

ఉమ్మనీరు ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే?

image

ప్రెగ్నెన్సీలో ఉమ్మనీరు బిడ్డకు కవచంలా ఉంటూ ఇన్‌ఫెక్షన్లు సోకకుండా రక్షిస్తుంది. ఉమ్మనీరు ఎక్కువగా ఉంటే అమ్మకు ఆయాసం ఎక్కువవుతుంది. ఏడో నెల తర్వాతయితే మరింత ఇబ్బంది అవుతుంది. నొప్పులు తొందరగా వస్తాయి. నిర్ణీత కాలం కంటే ముందుగానే ప్రసవం అయిపోతుంది. ఒక్కోసారి బేబీ చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఉమ్మనీరు ఎంత ఉందో చెక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.