News May 14, 2024

ఢిల్లీ లిక్కర్ కేసు.. ఈడీ ఛార్జ్‌షీట్‌పై నేడు విచారణ

image

ఢిల్లీ లిక్కర్ కేసులో MLC కవితపై ED దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై రౌస్ అవెన్యూ కోర్టు ఇవాళ విచారణ జరపనుంది. సోమవారమే దీనిపై విచారణ జరగాల్సి ఉండగా, అనివార్య కారణాలతో నేటికి వాయిదా పడింది. ఈనెల 10న 200 పేజీల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసిన ED.. అందులో చారియట్ ప్రొడక్షన్స్ మీడియా ఉద్యోగులు దామోదర్, ప్రిన్స్, చన్‌ప్రీత్‌తో పాటు అర్వింద్‌సింగ్‌ అనే వ్యక్తిని నిందితులుగా చేర్చింది.

Similar News

News December 11, 2025

కనకాంబరంలో పిండి నల్లి కట్టడి ఎలా?

image

పండ్లు, కూరగాయల పంటలను నష్టపరిచే పిండి నల్లి కనకాంబరం పంటను కూడా ఆశిస్తుంది. మొక్కల లేత కొమ్మలు, ఆకుల పూమొగ్గలు తెల్లటి పిండిలాంటి పదార్థంతో కప్పబడి ఉంటే పిండినల్లి ఆశించిందని గుర్తించాలి. ఈ పురుగులు రసం పీల్చి పంటకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. వీటి నివారణకు లీటర్ నీటికి 2ml డైమిథోయేట్ లేదా 2.5ml క్లోరిపైరిఫాస్ లేదా 0.3ml ఇమిడాక్లోఫ్రిడ్ కలిపి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.

News December 11, 2025

మన ఊహకందనంత శక్తిమంతుడు ‘విష్ణుమూర్తి’

image

లోకాధ్యక్షః సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః|
చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దంష్ట్రశ్చతుర్భుజః||
లోకాలన్నింటిలో అతి గొప్పవాడు, ధర్మానికి న్యాయ నిర్ణేత విష్ణు. జరిగిపోయింది, జరగాల్సిందంతా ఆయన చేతుల్లోనే ఉంటుంది. నాలుగు రూపాలుగా, నాలుగు పద్ధతుల్లో, నాలుగు భుజాలతో కనిపించే ఆయన మన ఊహకందనంత శక్తిమంతుడు. ఆ దైవాన్ని మనం మనసులో పెట్టుకొని భక్తితో ధ్యానిస్తే తప్పక అనుగ్రహిస్తాడు. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>

News December 11, 2025

ఇంత గందరగోళానికి ఇండిగోనే కారణం: రామ్మోహన్

image

ఇండిగో విమాన సేవలు తిరిగి గాడిలో పడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు తలెత్తిన సంక్షోభానికి ఆ సంస్థ ‘మిస్ మేనేజ్మెంట్’ మాత్రమే కారణమని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ‘వారి అంతర్గత సిబ్బంది రోస్టరింగ్ వ్యవస్థలో కొంత గందరగోళం నెలకొంది. FDTL మార్గదర్శకాల ప్రకారం కొత్త నిబంధనలకు అనుగుణంగా దానిని నివారించి ఉండొచ్చు. కానీ దురదృష్టవశాత్తు అలా జరగలేదు’ అని తెలిపారు.