News August 3, 2024

రాష్ట్రంలో డెంగ్యూ పంజా.. ఈ జిల్లాల్లోనే ఎక్కువ కేసులు

image

TG: రాష్ట్రంలో అత్యధికంగా డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. ఒక్క జులైలోనే 800 కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో 2,071 హైరిస్క్ ప్రాంతాలను గుర్తించి 33 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు ఏర్పాటు చేసింది. HYD, RR, మేడ్చల్, సంగారెడ్డి, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో లారా వ్యాప్తి ఎక్కువగా ఉందని ప్రకటించింది. దోమల వ్యాప్తి జరగకుండా అన్ని జిల్లాల్లో అధికారులు చర్యలు చేపట్టారు.

Similar News

News December 16, 2025

AP-RCET ఫలితాలు విడుదల

image

పీహెచ్‌డీ సీట్ల భర్తీకి నిర్వహించే AP-RCET(రీసెర్చ్ కామన్స్ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాలు విడుదలయ్యాయి. శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ ఆధ్వర్యంలో గత నెల నవంబరులో పరీక్షలు జరిగాయి. మొత్తం 65 సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించగా, 5,164 మంది ఎగ్జామ్స్ రాశారు. వారిలో 2,859 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఏపీ ఆర్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్.ఉష తెలిపారు. ఇక్కడ <>క్లిక్<<>> చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు.

News December 16, 2025

బరువు తగ్గినప్పుడు ఫ్యాట్ బయటికెలా వెళ్తుంది?

image

శరీరంలో కొవ్వు ట్రైగ్లిజరైడ్స్ రూపంలో నిల్వ ఉంటుంది. డైట్, వ్యాయమం వల్ల కేలరీలు తగ్గించినప్పుడు శరీరం ఆ కొవ్వును ఆక్సిడైజ్ చేసి శక్తిగా మారుస్తుంది. ఈ ప్రక్రియలో ఫ్యాట్ కరిగి కార్బన్ డై ఆక్సైడ్, నీరుగా విడిపోతుంది. 84% కార్బన్ డై ఆక్సైడ్‌గా మారి ఊపిరితో, 16% నీరుగా మారి చెమట, యూరిన్ ద్వారా బయటకు వెళ్తాయి. ఉదా. 10కిలోల ఫ్యాట్ తగ్గితే 8.4KGలు C02గా ఊపిరి ద్వారా, 1.6KGలు నీరుగా విసర్జింపబడతాయి.

News December 16, 2025

లిస్టులోకి మరో 19మంది ప్లేయర్లు.. నేడే మినీ వేలం

image

IPL మినీ వేలం లిస్టులో అభిమన్యు ఈశ్వరన్‌తో సహా 19 మంది ప్లేయర్లు చేరారు. దీంతో ఆక్షన్‌లో పాల్గొనే మొత్తం ఆటగాళ్ల సంఖ్య 369కి చేరింది. వేలానికి ముందు కొత్త ప్లేయర్లను చేర్చడం కొత్త విషయం కాకపోయినా ఇంతమంది యాడ్ కావడం ఇదే తొలిసారి అని BCCI తెలిపింది. నేడు గరిష్ఠంగా 77 మందిని కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ఇవాళ 2.30PM నుంచి అబుదాబిలో ఆక్షన్ ప్రారంభం కానుంది. KKR పర్సులో అత్యధికంగా రూ.64.30CR ఉన్నాయి.