News August 4, 2024
రేపు సా.5:04కు ‘దేవర’ సెకండ్ సింగిల్

‘దేవర’ సినిమా నుంచి రెండో పాటను రేపు సా.5:04 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. Jr.ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటిస్తున్న ఈ మూవీని కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ రాగా, రేపు రిలీజయ్యే లవ్ సాంగ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 27న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది.
Similar News
News December 14, 2025
15,762 ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్

జవహర్ నవోదయ, కేంద్రీయ విద్యాలయాల్లో 15,762 (పెంచిన తరువాత) ఉద్యోగాలకు దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. KVSలో 9,921, NVSలో 5841 పోస్టులున్నాయి. పోస్టును బట్టి PG, డిగ్రీ, B.Ed, M.Ed, MCA, M.PEd, CTET, ఇంటర్, డిప్లొమా పాసైనవారు అర్హులు. CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇప్పటికే రెండు సార్లు గడువు పొడిగించినందున మరోసారి అవకాశం ఉండకపోవచ్చు. సైట్: https://www.cbse.gov.in/
News December 14, 2025
నదీజలాలపై కేసీఆర్ ప్రత్యక్ష పోరాటం: BRS

TG: కేసీఆర్ అధ్యక్షతన ఈనెల 19న BRSLP, రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో కృష్ణా-గోదావరి నదులపై కేసీఆర్ సర్కార్ పదేళ్లలో చేపట్టిన ప్రాజెక్టులు, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై చర్చ జరుగుతుందని BRS వెల్లడించింది. ఏపీ ప్రభుత్వం జలాలను కొల్లగొడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోలేకపోతోందని విమర్శించింది. దీనిపై ప్రత్యక్ష పోరాటాలే శరణ్యం అని కేసీఆర్ భావిస్తున్నట్లు పేర్కొంది.
News December 14, 2025
ఉపసర్పంచ్‌ను ఎలా ఎన్నుకుంటారో తెలుసా?

గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అదే రోజు లేదా మరుసటి రోజు ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. ఈ పదవికి గ్రామ పంచాయతీలోని వార్డు సభ్యులలో ఒకరిని ఎన్నుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఉపసర్పంచ్ ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది. సర్పంచ్, వార్డు సభ్యులు సమావేశమై చేతులు పైకెత్తే విధానంలో (ఓపెన్ ఓటింగ్) ఉపసర్పంచ్‌ను ఎంపిక చేస్తారు. ఉపసర్పంచ్ పదవీకాలం ఐదేళ్లు.


