News April 13, 2024

దేవదాయ శాఖ సిబ్బందికి ఎన్నికల విధులు వద్దు: పురందీశ్వరి

image

AP: దేవదాయ శాఖ సిబ్బందికి ఎన్నికల విధులు కేటాయించడంపై BJP రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఆ శాఖ ఉద్యోగులెప్పుడూ ఎన్నికల విధుల్లో పాల్గొనలేదు. ఏప్రిల్, మే, జూన్‌లో అనేక పండుగలు ఉన్నాయి. వేసవి సెలవుల్లో ఆలయాలకు వచ్చేవారి సంఖ్య ఎక్కువ. ఆలయ సిబ్బంది లేకపోతే భక్తులు ఇబ్బందులు పడతారు. అందువల్ల వీరికి ఎన్నికల విధులపై పునఃపరిశీలన చేయండి’ అని EC, CEOకు లేఖ రాశారు.

Similar News

News December 8, 2025

ప్రధాని ప్రసంగంలో నిజాలు కరవయ్యాయి: ప్రియాంకా గాంధీ

image

ముఖ్యమైన సమస్యల నుంచి డైవర్ట్ చేయడానికే వందేమాతరంపై చర్చ అని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ విమర్శించారు. ‘వందేమాతరం కేవలం గేయం కాదు అది ప్రజల గొంతుక. ప్రధాని ప్రసంగంలో నిజాలు కరవయ్యాయి. వేల మంది మరణిస్తున్నారు. త్వరలో బెంగాల్‌లో ఎన్నికలు ఉన్నాయి. వాటిపై చర్చను వదిలేసి ఈ సమయంలో జాతీయ గేయంపై చర్చ అవసరమా?’ అని లోక్‌సభలో ప్రియాంక పేర్కొన్నారు.

News December 8, 2025

వ్యక్తిత్వ హక్కులు కాపాడాలంటూ హైకోర్టుకు జూ.ఎన్టీఆర్

image

ఈ-కామర్స్, SMలో తన పర్సనాలిటీ రైట్స్‌ను కాపాడాలని కోరుతూ జూ.ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం 2021 ఐటీ నిబంధనల ప్రకారం నిందితులపై చర్యలు తీసుకోవాలని సదరు SM ప్లాట్‌ఫామ్‌లను ఆదేశించింది. డిసెంబర్ 22న సవివరమైన ఆదేశాలు జారీ చేస్తామంటూ అదే రోజుకు తదుపరి విచారణను వాయిదా వేసింది. కాగా SMలో ట్రోలింగ్‌పై గతంలో నాగార్జున కూడా ఢిల్లీ HCని ఆశ్రయించారు.

News December 8, 2025

పాపులేషన్ రీసెర్చ్ సెంటర్‌లో ఉద్యోగాలు

image

<>యూనివర్సిటీ <<>>ఆఫ్ లక్నోలోని పాపులేషన్ రీసెర్చ్ సెంటర్‌ 10 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ( డెమోగ్రఫీ/పాపులేషన్ స్టడీస్/ స్టాటిస్టిక్స్/ఎకనామిక్స్/మ్యాథ్స్/సోషియాలజీ/సోషల్ వర్క్/ఆంత్రోపాలజీ/జియోగ్రఫీ)ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు డిసెంబర్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 21-40ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్‌సైట్:https://mohfw.gov.in