News August 23, 2025
ధర్మస్థల: శవాలు పూడ్చానన్న వ్యక్తి అరెస్టు

కర్ణాటకలోని ధర్మస్థలలో వందలాది మంది మహిళల మృతదేహాలను పూడ్చానని చెప్పిన మాజీ శానిటరీ వర్కర్‌ను సిట్ అరెస్ట్ చేసింది. అతడు చెప్పినవన్నీ అబద్ధాలేనని తేల్చి అదుపులోకి తీసుకుంది. 1995-2014 వరకు మహిళల శవాలను పూడ్చానని అతడు ఫిర్యాదు చేయడంతో నేత్రావతి నది ఒడ్డున గత కొన్ని రోజులుగా సిట్ తవ్వకాలు జరిపింది. కానీ ఎలాంటి అవశేషాలు లభించలేదు. తన భర్తతో కొందరు అబద్ధాలాడిస్తున్నారని అతడి భార్య మీడియాకు చెప్పింది.
Similar News
News January 19, 2026
కామారెడ్డి: ప్రియం కానున్న ఓటు విలువ

ఇంకా మున్సిపల్ ఎలక్షన్ కోడ్ కూయక ముందే కామారెడ్డిలో రాజకీయ వేడి మొదలైంది. రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఎక్కడిక్కడ ఆశావాహులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. మందుగా విందు ఇస్తూ ఓటర్లతో మమేకమవుతున్నారు. టికెట్ తెచ్చుకునే బాధ్యత మాది, గెలిపించే బాధ్యత మీది అంటూ సవాలు చేస్తున్నారు. ఈ సారి యువత పోటీలో ఉండేందుకు తీవ్ర కసరత్తు ప్రారంభించారు. దీంతో కామారెడ్డి మున్సిపల్ మరింత ప్రియం కానుంది.
News January 19, 2026
ఇండియా క్యాంప్‌కు ఎంపికైన గుంతకల్లు క్రీడాకారిణి మానస

ఖేలో ఇండియా, జాతీయ సెపక్ తక్రా క్రీడా అంశానికి సంబంధించి గుంతకల్లుకు చెందిన మానస ప్రతిభ కనబరిచి ఇండియన్ క్యాంప్‌కు ఎంపికయ్యారు. ఈ నెల 20 నుంచి బ్యాంకాక్‌లో, అనంతరం ఢిల్లీలో జరిగే శిక్షణలో ఆమె పాల్గొననున్నారు. మెరుగైన ప్రదర్శన కొనసాగిస్తే ఆసియా గేమ్స్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.