News April 14, 2024
DHONI: ఏంది సామీ ఈ క్రేజ్?

ORMAX Media సర్వే ప్రకారం IPL-2024లో మూడో వారంలోనూ మోస్ట్ పాపులర్ ప్లేయర్‌గా చెన్నై స్టార్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ నిలిచారు. తొలి రెండు వారాలు కూడా ధోనీనే మోస్ట్ పాపులర్ ప్లేయర్‌గా ఉన్నారు. ఈ సీజన్‌లో ధోనీ తన బ్యాటింగ్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తున్నారు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో తనదైన స్టైల్‌లో సిక్సర్లు బాది ప్రేక్షకులకు ఎంటర్టైన్‌మెంట్ అందించారు. ఆ మ్యాచ్‌లో 16 బంతుల్లోనే 37 పరుగులు చేశారు.
Similar News
News December 8, 2025
900 మంది పైలట్లను తీసుకోనున్న ఇండిగో!

సంక్షోభం నుంచి బయటపడేందుకు భారీగా పైలట్లను నియమించుకోవడంపై ఇండిగో దృష్టిపెట్టింది. ఫిబ్రవరి 10కి 158 మంది, 2026 Dec కల్లా 742 మందిని తీసుకుంటామని ప్రభుత్వానికి సంస్థ చెప్పినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ‘ప్రస్తుతం 250 మంది జూనియర్ ఫస్ట్ ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇస్తోంది. మరో 300 మంది కెప్టెన్లు, 600 మంది ఫస్ట్ ఆఫీసర్ల నియామకం/అప్‌గ్రేడ్ చేయనుంది’ అని తెలిపింది. కాగా ఇండిగోకు 5,456 మంది పైలట్లు ఉన్నారు.
News December 8, 2025
2026 DECకు పూర్తి కానున్న విశాఖ-రాయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వే

విశాఖపట్నం-రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్) ఎక్స్‌ప్రెస్‌వే పనులు 2026 చివరి నాటికి పూర్తి కానున్నాయి. రూ.16,482 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఆర్థిక కారిడార్‌ను కేంద్రం చేపట్టింది. మొత్తం 597 KM మార్గాన్ని 465KMకి తగ్గిస్తూ 6 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవేగా నిర్మిస్తోంది. దీంతో AP, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మధ్య ప్రయాణ సమయం దాదాపు 7 గంటలు తగ్గుతుంది. టూరిజం, పారిశ్రామిక రవాణా, వ్యాపార అవకాశాలకు పెద్ద ఊతం లభించనుంది.
News December 8, 2025
పాలు పితికేటప్పుడు ఇవి గమనించాలి

రోజూ ఒకే సమయంలో పాలు పితకాలి. ఈ సమయంలో పశువు బెదరకుండా, చిరాకు పడకుండా చూడాలి. పాల ఉత్పత్తికి అవసరమయ్యే ఆక్సిటోసిన్ హార్మోను మెదడు నుంచి విడుదలై రక్తప్రసరణలో 8 నిమిషాలే ఉంటుంది. అందుకే పాలను 5-8 నిమిషాల లోపే తీయాలి. దీని వల్ల పాలలో అధిక వెన్నశాతం పొందొచ్చు. పాల తొలి ధారల్ని దూడలకు తాగించి, మలి ధారలను కేంద్రానికి పోయాలి. వీటిలో సుమారు 10% వెన్న ఉంటుంది. వీటిని దూడకు తాగించడం మంచిది కాదు.


