News August 22, 2024

పవన్ కళ్యాణ్‌తో ‘ఓజీ’ డైరెక్టర్, ప్రొడ్యూసర్

image

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ‘ఓజీ’ సినిమా డైరెక్టర్ సుజీత్, ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య కలిశారు. అమరావతిలోని ఆఫీసులో సినిమా షూటింగ్ గురించి చర్చించినట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో చిత్రీకరణ పునఃప్రారంభం కానున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 2న పవర్ స్టార్ బర్త్‌డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Similar News

News January 18, 2026

టీడీపీని ఈ గడ్డపైకి తెచ్చే పన్నాగాలను జనం తిప్పికొడతారు: కేటీఆర్

image

TG: బీఆర్ఎస్ దిమ్మెలను కూల్చివేయాలన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై KTR ఫైరయ్యారు. ‘సీఎంగానే కాదు హోంమంత్రిగా ఉన్నావన్న సోయి లేకుండా BRS జెండా గద్దెలను ధ్వంసం చేయాలంటావా? శాంతిభద్రతల్లో పదేళ్లు దేశానికి ఆదర్శంగా నిలిచిన TGలో ఇప్పుడు అరాచకాలు చేసేవారు రాజ్యమేలడం ఓ దరిద్రం. బీఆర్ఎస్‌ను ఎదుర్కోలేక BJPతో చీకటి ఒప్పందాలు, టీడీపీని తిరిగి ఈ గడ్డపైకి తెచ్చే నీ పన్నాగాలను ప్రజలు తిప్పికొడుతారు’ అని మండిపడ్డారు.

News January 18, 2026

హీరో ధనుష్‌తో పెళ్లి.. మృణాల్ టీమ్ రియాక్షన్ ఇదే

image

వచ్చే నెల 14న తమిళ హీరో ధనుష్‌తో <<18863331>>పెళ్లి<<>> అంటూ జరుగుతున్న ప్రచారానికి హీరోయిన్ మృణాల్ ఠాకూర్ టీమ్ తెరదించింది. ‘మృణాల్ వచ్చే నెలలో పెళ్లి చేసుకోవట్లేదు. ఎలాంటి కారణం లేకుండానే ఈ ప్రచారం జరుగుతోంది’ అని పేర్కొంది. అది పూర్తిగా తప్పుడు ప్రచారమని, ఎవరూ నమ్మొద్దని సూచించింది. కాగా ఇప్పటివరకు మృణాల్ గానీ ధనుష్ గానీ ఈ ప్రచారంపై స్పందించకపోవడం గమనార్హం.

News January 18, 2026

రాష్ట్ర పరిణామాలపై ప్రధాని జోక్యం చేసుకోవాలి: బొత్స

image

AP: రాష్ట్రంలో నెలకొంటున్న పరిణామాలపై ప్రధాని జోక్యం చేసుకోవాలని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ ఏడాది ఏ వర్గానికీ సంక్రాంతి సంతోషం లేదన్నారు. పండగ ముందే మద్యం ధరలు, భూముల విలువలు పెరిగాయని విమర్శించారు. ‘పంటలకు గిట్టుబాటు ధర లేదు. యూరియా ఇప్పటికీ అధిక ధరకే అమ్ముతున్నారు. ఆరోగ్యశ్రీ పూర్తిగా అటకెక్కింది. గ్రామ బహిష్కరణలు, శాంతిభద్రతల లోపాలపై ప్రధాని మోదీ స్పందించాలి’ అని కోరారు.