News April 14, 2024

కులాన్ని నమ్ముకుని రాజకీయం చేయట్లేదు: పవన్ కళ్యాణ్

image

AP: అంబేడ్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నానని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. తెనాలి సభలో మాట్లాడుతూ.. ‘నేను ఒక కులాన్ని నమ్ముకుని రాజకీయం చేయట్లేదు. ఒక వైశ్యుడి దాతృత్వంతో నేను చదువుకున్నా. రెండు చోట్లా ఓడిపోయినా తట్టుకున్నా. ప్రజలు నన్ను మోసం చేశారని నేను వెనక్కి తగ్గలేదు. రాష్ట్రం కోసం మళ్లీ ప్రజల మధ్యకే వచ్చా’ అని పేర్కొన్నారు.

Similar News

News December 17, 2025

తుది పోరు.. పోలింగ్ ప్రారంభం

image

తెలంగాణలో తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొన్నటి వరకు జోరుగా ప్రచారం చేసిన సర్పంచ్, వార్డు అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. మ.2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు, తర్వాత ఫలితాల వెల్లడి ఉంటుంది. నేటితో రాష్ట్రంలో పంచాయతీ పోరు ముగియనుంది. అయితే రేపటి వరకు సెక్షన్ 136 అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు.

News December 17, 2025

ఇతిహాసాలు క్విజ్ – 99

image

ఈరోజు ప్రశ్న: హిందూ పురాణాల ప్రకారం.. ఈ మాసంలో సూర్య కిరణాలు ప్రత్యేక తేజస్సుతో ఉండి, అశుభాలను తొలగిస్తాయని నమ్ముతారు. అలాగే, ఈ మాసం శని దేవుని జన్మ నక్షత్రంగా పరిగణిస్తారు. ఇంతకీ అది ఏ మాసం?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>

News December 17, 2025

CUSB 84 పోస్టులకు నోటిఫికేషన్

image

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ బిహార్(CUSB) 84 టీచింగ్(62), నాన్ టీచింగ్(22) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు జనవరి 15వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, సంబంధిత విభాగంలో పీజీ, PhD, M.Ed, NET/SLET/SET, LLM, M.Tech, MBBS, M.LSc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://www.cusb.ac.in