News April 28, 2024

వాలంటీర్లను రద్దు చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా?: జగన్

image

AP: YCP పథకాలను రద్దు చేస్తానని చెప్పే దమ్ము చంద్రబాబుకు ఉందా అని CM జగన్ ప్రశ్నించారు. ‘వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసే దమ్ముందా? సచివాలయ వ్యవస్థను రద్దు చేసే దమ్ముందా? జన్మభూమి కమిటీలను మళ్లీ తీసుకొస్తానని చెప్పే ధైర్యం ఉందా? జగన్ రూపాయి ఇస్తానంటే బాబు నాలుగు రూపాయలు ఇస్తానంటారు. చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్ర లేపడమే. పేదవాడి భవిష్యత్ మారాలంటే మళ్లీ YCPనే రావాలి’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News April 15, 2026

మరింత పెరగనున్న వాహనాల ధరలు?

image

నిర్వహణ ఖర్చులు పెరిగాయంటూ ఇప్పటికే ఆటోమొబైల్ కంపెనీలు వాహనాల ధరలు పెంచుతున్నాయి. యుద్ధం మరింత కాలం కొనసాగితే ఉత్పత్తి వ్యయం పరిమితికి మించి పెరిగి రేట్లు మరింత పెంచాల్సి రావొచ్చని భారత వాహన తయారీదారుల సమాఖ్య(సియామ్) అధ్యక్షుడు శైలేశ్ చంద్ర తెలిపారు. కమోడిటీ ధరలు ఏమేర పెరుగుతాయనేది 4-5 వారాల్లో స్పష్టత రావొచ్చన్నారు. ఆ తర్వాతే వాహనాల రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుందని వెల్లడించారు.

News April 15, 2026

US-ఇరాన్ చర్చలపై వాన్స్ కీలక వ్యాఖ్యలు

image

అమెరికా, ఇరాన్ మధ్య దశాబ్దాలుగా నమ్మకం లేకపోవడమే పెద్ద అడ్డంకి అని JD వాన్స్ అభిప్రాయపడ్డారు. దాన్ని తొలగించడం అంత సులభం కాదని పేర్కొన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న సీజ్‌ఫైర్‌ను పూర్తిస్థాయి శాంతి ఒప్పందంగా మార్చడం పెద్ద ఛాలెంజ్ అన్నారు. ఏళ్ల తరబడిగా ఉన్న విభేదాలు ఒక్క రాత్రిలో పరిష్కారం కావని స్పష్టం చేశారు. మరోసారి ఇరుపక్షాలు చర్చలకు సిద్ధమవుతున్న తరుణంలో వాన్స్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

News April 15, 2026

IIGMలో 26 రిసెర్చ్ స్కాలర్ పోస్టులు

image

కాంట్రాక్ట్ పద్ధతిలో 26 రిసెర్చ్ స్కాలర్ పోస్టుల భర్తీకి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జియోమ్యాగ్నటిజం (IIGM), నవీ ముంబై.. దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 60% మార్కులతో MSc పూర్తి చేసిన వారు అర్హులు. వయసు 27 ఏళ్లు మించకూడదు. ఎగ్జామ్, ఇంటర్వ్యూతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అప్లికేషన్ ఫీజు – రూ.100. ఆన్‌లైన్‌ లో దరఖాస్తు చేసుకోవడానికి 30-4-26 చివరి తేదీ. పూర్తి వివరాలకు iigm.res.in/careers చూడండి.