News April 26, 2024
TDPలో చేరిన డొక్కా వరప్రసాద్

AP: వైసీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ టీడీపీలో చేరారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో ఆయన ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. కాగా ఈరోజు ఉదయం వైసీపీకి డొక్కా రాజీనామా చేశారు. ఆ పార్టీ తరఫున తాడికొండ సీటు ఆశించారు. కానీ ఆ స్థానాన్ని మేకతోటి సుచరితకు కేటాయించడంతో ఆయన అసంతృప్తితో వైసీపీని వీడారు.
Similar News
News April 16, 2026
రాత్రి బ్రష్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా?

రాత్రి నిద్రకు ముందు బ్రష్ చేయడం ఎంతో ముఖ్యమని వైద్యులు సూచించారు. ‘రోజంతా తిన్న ఆహారం, చక్కెర దంతాలపై ఒక పొరలా పేరుకుపోతాయి. రాత్రి బ్రష్ చేయకపోతే గంటల తరబడి అలాగే ఉండి బాక్టీరియా పెరుగుతుంది. అది ఎనామెల్‌ను దెబ్బతీసి కావిటీస్, చిగుళ్ల సమస్యలకు దారి తీస్తాయి. నోటి దుర్వాసన పెరుగుతుంది. అందుకే రాత్రి భోజనం చేశాక నిద్ర పోయే ముందు బ్రష్ చేసుకోవాలి’ అని సూచిస్తున్నారు.
Share It

సీఎం రేవంత్ రెడ్డితో టీడీపీ మహిళా నేతలు

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ టీడీపీ మహిళా నేతలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ ఫొటోలను మాజీ మంత్రి పరిటాల సునీత సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ ఛైర్మన్లు ఉన్నారు. కాగా పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లుపై చర్చ సందర్భంగా మహిళా నేతలు అక్కడికి వెళ్లారు.