News April 1, 2024
పోటీపై ఆసక్తి చూపని అన్నదాతలు

ప్రభుత్వాలు తమ సమస్యలు పరిష్కరించకుంటే అన్నదాతలు ఎన్నికల్లో నామినేషన్లు వేసి తమ నిరసన వ్యక్తం చేయడం చాలాసార్లు చూశాం. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని రాజధానిలో ఆందోళన చేస్తున్న కిసాన్ మోర్చా రైతులూ ఈ ఎన్నికల్లో నామినేషన్లు వేస్తారని చాలామంది భావించారు. కానీ, వారు అందుకు సుముఖంగా లేరు. తాము BJP విధానాలను వ్యతిరేకిస్తున్నామని, అంతమాత్రాన పోటీ చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు.
#ELECTIONS
Similar News
News February 19, 2026
విమానంలో ఇబ్బంది కలిగిస్తే ట్రావెల్ బ్యాన్!

విమానాల్లో తోటి ప్రయాణికులు, సిబ్బందికి ఇబ్బంది కలిగించే ప్రయాణికులపై కఠిన చర్యలకు DGCA సిద్ధమైంది. కొత్త ప్రతిపాదిత రూల్స్ ప్రకారం విమానంలో స్మోకింగ్ చేసినా, తాగి గొడవ చేసినా ఎయిర్‌లైన్స్ నేరుగా 30 రోజుల వరకు ట్రావెల్ బ్యాన్ విధించొచ్చు. కాక్‌పిట్‌లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తే ఏకంగా రెండేళ్లకు పైగా నిషేధం తప్పదు. గొడవ చేసే వారిని ‘Disruptive’ కేటగిరీ కింద చేర్చి ఎయిర్‌లైన్సే చర్యలు తీసుకోవచ్చు.
News February 19, 2026
పోలీసులపై అంబటి రాంబాబు ఆగ్రహం

AP: నిన్న జైలు నుంచి విడుదలైన YCP నేత అంబటి రాంబాబుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. రాజమండ్రి నుంచి గుంటూరుకు ఊరేగింపుగా వెళ్లొద్దని తెలిపారు. దీనిపై అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ’18 రోజుల తర్వాత ఇంటికి వెళ్తుంటే ఏంటీ నిర్బంధాలు? నేనేమైనా ర్యాలీ తీస్తున్నానా? ఆంక్షలు ఎందుకు? 10 మంది కార్యకర్తలు వచ్చి నన్ను పలకరించడం తప్పా?’ అని ప్రశ్నించారు. పోలీసుల తీరుకు నిరసనగా కారు దిగి నడుచుకుంటూ వెళ్లారు.
News February 19, 2026
షాకిచ్చిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹2,290 పెరిగి ₹1,56,490కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు ₹2,100 ఎగబాకి ₹1,43,450 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ ధర ఏకంగా ₹10 వేలు పెరిగి ₹2,70,000గా ఉంది. ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప తేడాలు ఉండొచ్చు.


