News April 1, 2024

ఈ విషయాల్లో ‘ఫూల్’ అవ్వొద్దు!

image

ఏప్రిల్ 1.. ఈరోజు స్నేహితులు, బంధువులు అబద్ధాలతో ఫూల్‌ను చేస్తుంటారు. దీంతో పెద్ద నష్టం లేకపోయినా కొన్ని విషయాల్లో ఫూల్ అవ్వకుండా జాగ్రత్త పడాలని పలువురు సూచిస్తున్నారు. సైబర్ మోసాలు, సోషల్ మీడియాలో సంబంధాలు, ఆఫర్ల పేరిట బురిడీ కొట్టించే లింకులు క్లిక్ చేయడం, ఇతరులను గుడ్డిగా నమ్మడం వంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. ఆన్‌లైన్ పరంగా ఏ నిర్ణయమైనా ఆచితూచి అడుగు వేయాలని సూచిస్తున్నారు.

Similar News

News February 18, 2026

హెయిర్ వాష్ 2 సార్లు చేసుకోవాలా?

image

తల స్నానం చేసినప్పుడు డబుల్ వాష్ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని డెర్మటాలజిస్టులు సూచిస్తున్నారు. ‘మొదటి వాష్‌తో మురికి, ఆయిల్, చెమట, కాలుష్యంతో పేరుకుపోయిన పదార్థాలు, చుండ్రు తొలగిపోతాయి. రెండో వాష్‌తో షాంపూ మరింత ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది. తల శుభ్రంగా ఉండటంతో అందులోని ప్రోటీన్లు నేరుగా చొచ్చుకెళ్తాయి. తల చర్మం, జుట్టు మరింత దృఢంగా మారుతాయి‘ అని అంటున్నారు.

News February 18, 2026

ఇంటి దేవుడిని పూజించడానికి అనువైన రోజు ఏదంటే?

image

కుజ గ్రహం, హనుమంతుడు, సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు మంగళవారం. ఈ రోజున ఇంటి దేవుడిని పూజిస్తే విశేష ఫలితాలుంటాయని అంటున్నారు పండితులు. ‘మంగళవారం రోజున ఇలవేల్పును పూజిస్తే జాతక దోషాలు తొలగి, మనసులో ధైర్యం, పట్టుదల పెరుగుతుంది. ఈరోజు చేసే ప్రత్యేక పూజలతో ఆగిపోయిన పనులు త్వరగా పూర్తవుతాయి. శత్రువులపై విజయం లభిస్తుంది. కుటుంబీకులు అందరూ పూజలో పాల్గొనడం ఉత్తమం’ అని సూచిస్తున్నారు.

News February 18, 2026

మీరు ఎన్నటికీ గెలవలేరు: ఖమేనీ

image

ఇస్లామిక్ రిపబ్లిక్‌ను కూలదోయడంలో అమెరికా ఎప్పటికీ విజయం సాధించలేదని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అన్నారు. ‘వారిది ప్రపంచంలోనే బలమైన సైనిక శక్తి అని US అధ్యక్షుడు చెబుతున్నారు. అలాంటి శక్తి కూడా తీవ్రంగా దెబ్బతినొచ్చు. మళ్లీ కోలుకోదు. యుద్ధనౌకలు ప్రమాదకరమే. కానీ వాటిని సముద్రం అడుగుకు పంపగల ఆయుధాలు ఇంకా ప్రమాదకరం’ అని హెచ్చరించారు. తమ అణు పరిశ్రమ దేశాన్ని నడిపించేందుకేనని, యుద్ధానికి కాదని చెప్పారు.