News May 14, 2024
గాజాలో నరమేధం జరగుతోందని భావించడం లేదు: అమెరికా

గాజాలో నరమేధం జరుగుతున్నట్లు తాము భావించడం లేదని అమెరికా NSA సలివాన్ స్పష్టం చేశారు. అయితే, పాలస్తీనా పౌరుల్ని రక్షించేందుకు ఇజ్రాయెల్ మరింత కృషి చేయాలని ఓ ప్రెస్‌మీట్‌లో అభిప్రాయపడ్డారు. ‘పౌరుల విషయంలో ఇజ్రాయెల్ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తుందని మేం నమ్ముతున్నాం. హమాస్ ఓడిపోవాలనే బైడెన్ కోరుకుంటున్నారు. కానీ పాలస్తీనీయులు నరకయాతన అనుభవిస్తున్నారని కూడా ఆయన గుర్తించారు’ అని పేర్కొన్నారు.
Similar News
News December 8, 2025
పాలు పితికేటప్పుడు ఇవి గమనించాలి

రోజూ ఒకే సమయంలో పాలు పితకాలి. ఈ సమయంలో పశువు బెదరకుండా, చిరాకు పడకుండా చూడాలి. పాల ఉత్పత్తికి అవసరమయ్యే ఆక్సిటోసిన్ హార్మోను మెదడు నుంచి విడుదలై రక్తప్రసరణలో 8 నిమిషాలే ఉంటుంది. అందుకే పాలను 5-8 నిమిషాల లోపే తీయాలి. దీని వల్ల పాలలో అధిక వెన్నశాతం పొందొచ్చు. పాల తొలి ధారల్ని దూడలకు తాగించి, మలి ధారలను కేంద్రానికి పోయాలి. వీటిలో సుమారు 10% వెన్న ఉంటుంది. వీటిని దూడకు తాగించడం మంచిది కాదు.
News December 8, 2025
ఇవాళ్టి మ్యాచులకు నో ఎంట్రీ!

HYDలోని ఉప్పల్, జింఖానా మైదానాల్లో SMATలో భాగంగా ఇవాళ 4 మ్యాచులు జరగనున్నాయి. అయితే ప్రేక్షకులను అనుమతించకూడదని HCA నిర్ణయించింది. DEC 2న పంజాబ్, బరోడా మధ్య మ్యాచ్ జరగ్గా హార్దిక్, అభిషేక్‌ను చూడటానికి భారీగా ఫ్యాన్స్ వచ్చారు. సరైన సెక్యూరిటీ లేక పలువురు గ్రౌండులోకి వెళ్లి ప్లేయర్లతో సెల్ఫీలు సైతం దిగారు. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల భద్రత దృష్యా ఆడియన్స్‌ను అనుమతించకూడదని నిర్ణయించినట్లు HCA తెలిపింది.
News December 8, 2025
రెచ్చగొట్టేలా జైశంకర్ వ్యాఖ్యలు: పాకిస్థాన్

విదేశాంగ మంత్రి జైశంకర్‌పై పాకిస్థాన్ మండిపడింది. పాక్ ఆర్మీ నుంచే తమకు చాలా <<18486203>>సమస్యలు<<>> వస్తాయని ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించింది. ‘ఆయన మాటలు రెచ్చగొట్టేలా ఉన్నాయి. పాక్ బాధ్యతాయుత దేశం. మా వ్యవస్థలు జాతీయ భద్రతకు మూలం’ అని పాక్ విదేశాంగ శాఖ ఆఫీసు ప్రతినిధి తాహిర్ చెప్పారు. తమపై దాడికి దిగితే దేశాన్ని రక్షించుకోవాలనే పాక్ దళాల సంకల్పానికి మేలో జరిగిన ఘర్షణే రుజువు అంటూ గొప్పలు చెప్పుకొచ్చారు.


