News April 21, 2024

హంతకులకు ఓటు వేయొద్దు: వైఎస్ సునీత

image

AP: నేర చరిత్ర కలిగిన హంతకులకు ఎన్నికల్లో ఓటు వేయొద్దని వైఎస్ సునీత కోరారు. ‘క్రిమినల్ కేసులు ఉన్న వైఎస్ అవినాశ్ రెడ్డికి ఎందుకు టికెట్ ఇచ్చిందో వైసీపీ చెప్పాలి? నేర చరిత్ర ఉన్న వారికి టికెట్ ఇవ్వడంపై ఆ పార్టీ వెబ్‌సైట్‌లో పేర్కొనాలి. అవినాశ్ నేరచరిత్రపై ఈసీకి ఎందుకు తెలపలేదు? అభ్యర్థిపై క్రిమినల్ కేసులుంటే అఫిడవిట్‌లో తెలపాలి. కానీ ఈ నిబంధనలన్నీ వైసీపీ తుంగలో తొక్కింది’ అని ఆమె విరుచుకుపడ్డారు.

Similar News

News December 15, 2025

బంధాలకు భయపడుతున్నారా?

image

గామోఫోబియా అనేది రిలేషన్‌షిప్‌కు సంబంధించిన భయం. ఏదైనా బంధంలోకి వెళ్లడానికి, కమిట్‌మెంట్‌కు వీరు భయపడతారు. ఇదొక మానసిక సమస్య. ఈ ఫోబియా ఉన్నవాళ్లు ఒంటరిగా బతకడానికే ఇష్టపడతారు. దీన్నుంచి బయటపడటానికి మానసిక వైద్యుడిని సంప్రదించాలి. కౌన్సెలింగ్‌ తీసుకోవాలి. కుటుంబసభ్యులతో గడపాలి. పెళ్లికి సంబంధించి పాజిటివ్ విషయాలను తెలుసుకోవాలి. ఈ సమస్య నుంచి బయటపడి సరైన బంధంలోకి వెళ్లి జీవితాన్ని ఆస్వాదించండి.

News December 15, 2025

కోటి సంతకాల పత్రాలతో నేడు వైసీపీ ర్యాలీలు

image

AP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించనున్నట్లు వైసీపీ తెలిపింది. అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమం చేపట్టనుంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన కోటి సంతకాల పత్రాలను పార్టీ శ్రేణులు ర్యాలీలో ప్రదర్శించనున్నాయి. వాటిని ఈ నెల 18న గవర్నర్‌ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు వైసీపీ అధినేత జగన్ అందజేయనున్నారు. కాలేజీలను ప్రైవేటుపరం చేయొద్దని కోరనున్నారు.

News December 15, 2025

దారుణం.. అదనపు కట్నం కోసం కోడలి హత్య!

image

TG: అదనపు కట్నం కోసం కోడల్ని దారుణంగా హత్య చేసిన ఘటన మహబూబాబాద్(D) కొమ్ముగూడెంలో చోటు చేసుకుంది. స్వప్న, రామన్న 15 ఏళ్ల క్రితం పెద్దల అంగీకారంతో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో ₹3L కట్నం, 8 తులాల బంగారం, తర్వాత ఎకరం పొలం కట్నంగా ఇచ్చారు. అయినా వేధింపులు ఆగలేదు. తాజాగా ఆమెను కొట్టి చంపి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నోట్లో పురుగుమందు పోసి పారిపోయారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.