News May 7, 2025
పాకిస్థాన్‌తో క్రికెట్ అసలే వద్దు: గంగూలీ

పాకిస్థాన్‌తో భారత్ క్రికెట్ సంబంధాలు పూర్తిగా తెంచుకోవాలని BCCI మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సూచించారు. ఇటువంటి ఘటనలు ఏటా జరుగుతున్నాయి. ఇది జోక్ కాదు టెర్రరిజాన్ని సహించేది లేదని తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో గంగూలీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా 2013లో చివరిసారిగా పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడిన భారత్ ఐసీసీ టోర్నీల్లో హైబ్రిడ్ మోడల్‌లో తటస్థ వేదికలలో మ్యాచులు ఆడుతోంది.
Similar News
News February 17, 2026
దానిమ్మ పంట నాణ్యత, ఆదాయం పెంచే ‘క్రాప్ కవర్’

కొన్నిచోట్ల దానిమ్మ చెట్లపై తెల్లని కవర్ గమనించే ఉంటారు. వీటినే క్రాప్ కవర్స్ అంటారు. వీటిని ప్లాస్టిక్+నైలాన్‌తో తయారు చేస్తారు. ఈ కవర్ వల్ల పండు ఈగ, ఇతర చీడపీడల నుంచి పంటకు రక్షణ లభిస్తుంది. అలాగే మొక్క, కాయలపై అధిక ఎండ, చలి తీవ్రత పడకుండా ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. నేలలో తేమను నిలకడగా ఉంచి కలుపు బెడదను తగ్గిస్తుంది. ఫలితంగా తెగుళ్లు, మచ్చలు లేని నాణ్యమైన పంటతో పాటు అధిక ఆదాయం పొందవచ్చు.
News February 17, 2026
అప్పుడు క్లీన్‌స్వీప్.. ఇప్పుడు జీరో!

TG: సర్పంచ్ ఎన్నికల్లో కాస్త సత్తా చాటిన BRS మున్సిపల్ ఎన్నికల్లో చతికిలపడింది. 7 కార్పొరేషన్లలో ఒక్క చోట కూడా మేయర్ <<19160296>>పదవి<<>> దక్కించుకోలేకపోయింది. 2020లో ఆ పార్టీ పదికి పది కార్పొరేషన్లు సొంతం చేసుకోవడం గమనార్హం. అటు 116 మున్సిపాలిటీల్లో 18 చోట్ల మాత్రమే ఛైర్మన్ పీఠం కైవసం చేసుకుంది. ఇందులోనూ 13 స్థానాల్లో పూర్తి మెజార్టీ ఉండగా మిగతా 5 చోట్ల కాంగ్రెస్, ఇతరులతో పొత్తు పెట్టుకొని పదవులు దక్కించుకుంది.
News February 17, 2026
‘కుతల ఆర్భాటమే కానీ కుప్పలో గింజలు లేవు’

కొందరు వ్యక్తులు తమకు అన్నీ తెలుసని, తాము చాలా గొప్పవారమని గంభీరమైన మాటలు చెబుతుంటారు. కానీ పని అప్పగిస్తే ఏమీ చేయలేరు. అలాగే పెద్ద కుప్పలా ఉన్న ధాన్యాన్ని గాలికి ఎగబోసేటప్పుడు అందులో నుంచి శబ్ధం(కుతల) వస్తుంది. తీరా చూస్తే అందులో అసలైన గింజలు (ధాన్యం) లేకుండా, కేవలం పొట్టు లేదా తాలు మాత్రమే ఉంటే “వట్టి కుతల ఆర్భాటమే తప్ప, కుప్పలో గింజలు లేవు” అనే సామెతను రైతులు వాడుతుంటారు.


