News September 12, 2025

DRKM: భీమేశ్వరస్వామిని దర్శించుకున్న రాజీవ్ కనకాల

image

రామచంద్రపురం మండలం, ద్రాక్షారామంలోని శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామిని సినీ నటుడు రాజీవ్ కనకాల గురువారం రాత్రి దర్శించుకున్నారు. ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు. భీమేశ్వర స్వామిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని రాజీవ్ కనకాల పేర్కొన్నారు.

Similar News

News December 8, 2025

అంజూ బాబీ జార్జ్‌.. ఎందరికో ఆదర్శం

image

మన దేశానికి వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో తొలి పతకం తెచ్చిన క్రీడాకారిణి అంజూ బాబీ జార్జ్. కేరళకు చెందిన అంజూ ఒక జన్యుపరమైన సమస్యతో ఒకే కిడ్నీతో జన్మించినా.. దాన్ని అధిగమించి ఎన్నో పతకాలు, అవార్డులు సొంతం చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అర్జున, ఖేల్‌రత్న, పద్మశ్రీ పురస్కారాలతో పాటు వరల్డ్ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ నుంచి వుమెన్‌ ఆఫ్ ది ఇయర్‌ అవార్డ్ గెలుచుకొని ఎందరికో ఆదర్శంగా నిలిచారు.

News December 8, 2025

KNR: ‘పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించాలి’

image

గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఎన్నికల పరిశీలకులు ఎన్.వెంకటేశ్వర్లు సూచించారు. కరీంనగర్ జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఆయన, ఏర్పాట్లు, భద్రత, సిబ్బంది సమన్వయం తదితర అంశాలను పరిశీలించారు. లోపాలున్న చోట వెంటనే సరిదిద్దాలని, ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

News December 8, 2025

MHBD: తుది పోటీలో 468 సర్పంచ్ అభ్యర్థులు

image

MHBDజిల్లాలో మొదటి విడత మండలాలకు సంబంధించి సర్పంచ్, వార్డు స్థానాలకు సంబంధించి ఏకగ్రీవంతో పాటు, తుది పోటీలో ఉన్నవారి వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో మొదటి విడత మండలాలు గూడూరు, ఇనుగుర్తి, కేసముద్రం, MHBD, నెల్లికుదురు మండలాల్లో 9 సర్పంచ్, 266 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 468 సర్పంచ్ అభ్యర్థులు, 2421మంది వార్డు సభ్యులు తుది పోటీలో ఉన్నారు. డిసెంబర్ 11న ఎన్నికలు జరగనునున్నాయి.