News February 19, 2025
అయోధ్య రామాలయంపై డ్రోన్.. కూల్చివేత

అయోధ్యలోని రామమందిరంపై అనుమానాస్పద డ్రోన్ ఎగరడం కలకలం రేపింది. యాంటీ డ్రోన్ వ్యవస్థను పరీక్షిస్తుండగా డ్రోన్‌ను గుర్తించి నేలకూల్చామని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసి గురుగ్రామ్‌కు చెందిన ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ‘ఆలయానికి రెండున్నర కి.మీ దూరంలో ఎక్కడ డ్రోన్ ఎగురుతున్నా యాంటీ డ్రోన్ వ్యవస్థ కనిపెట్టేస్తుంది. మందిరం పరిసరాల్లో డ్రోన్లపై నిషేధం ఉంది’ అని పేర్కొన్నారు.
Similar News
News April 13, 2026
స్మార్ట్ గవర్నెన్స్.. సింగపూర్‌కు 9 మంది మంత్రులు

AP: ప్రజలకు స్మార్ట్ గవర్నెన్స్‌ను అందించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా 9 మంది మంత్రులు, ఉన్నతాధికారులకు ట్రైనింగ్ ఇప్పించనుంది. ఈ నెల 21 నుంచి 27 వరకు నారాయణ, అచ్చెన్న, నాదెండ్ల, సత్యకుమార్, అనగాని, నిమ్మల, పయ్యావుల, అనిత, జనార్దన్ సింగపూర్‌లో పర్యటించనున్నారు. రోజుకొక అంశంపై వారం రోజులపాటు శిక్షణ ఉంటుంది. వారు తిరిగొచ్చాక ఇతర ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పిస్తారు.
News April 13, 2026
అన్నదాతకు ‘ఉల్లి’పోటు.. భారీగా పడిపోయిన ధర

TG: ఉల్లి ధరలు రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. సంగారెడ్డి(D) సదాశివపేట మార్కెట్‌లో గతేడాది APRలో రూ.2,300 పలికిన క్వింటాల్ ఉల్లి తాజాగా రూ.504కు పడిపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 45 వేల ఎకరాల్లో ఉల్లి సాగవుతోంది. JAN-MAY మధ్య భారీగా దిగుబడి వస్తుంది. దీంతో ధరలు పతనమయ్యాయి. హైదరాబాద్ సహా చాలా ప్రాంతాల్లో వ్యాపారులు రూ.100కు 5-8 కిలోల వరకు ఉల్లి విక్రయిస్తున్నారు.
News April 13, 2026
సెన్సస్.. రూల్స్ బ్రేక్ చేస్తే ఫైన్, జైలు శిక్ష

AP: సెన్సస్-2027లో భాగంగా రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి 30 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్‌కు అవకాశం ఉంటుంది. మే 1 నుంచి క్షేత్రస్థాయి గణన ప్రారంభం కానుంది. అధికారులు జనాభా లెక్కల కోసం వచ్చినప్పుడు ఇళ్ల యజమానులు అనుమతించాలని ప్రభుత్వం సూచించింది. ‘వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమివ్వాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా లేదా జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఇదే రూల్ అధికారులకూ వర్తిస్తుంది’ అని పేర్కొంది.


