News May 21, 2024
రేవ్ పార్టీలో డ్రగ్స్.. వెలుగులోకి కీలక విషయాలు

బెంగళూరు <<13282273>>రేవ్<<>> పార్టీ కేసుకు సంబంధించి పోలీసుల రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు ఉన్నాయి. ‘సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ’ పేరుతో వాసు అనే వ్యాపారి బర్త్ డే పార్టీ ఇచ్చారు. దాదాపు 150 మంది సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. పార్టీలో పెడ్లర్స్ సిద్ధిఖీ, రణ్‌ధీర్, రాజ్ పెద్ద మొత్తంలో డ్రగ్స్ విక్రయించారు. దీంతో పెడ్లర్స్‌తోపాటు ఈవెంట్ ఇన్‌ఛార్జ్ అరుణ్, పార్టీ ఇచ్చిన వాసును పోలీసులు అరెస్టు చేశారు.
Similar News
News March 10, 2026
రాత్రి మంచి నిద్ర కోసం..

రాత్రి వేళ చక్కటి నిద్ర కోసం ఆహారంలో అరటిపండు, పిస్తా, బార్లీ, పాలు, పెరుగు, గుడ్డు తెల్లసొన, గుమ్మడి విత్తనాలు భాగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వీటిలోని ట్రిప్టోఫాన్ నిద్రలో కీలకపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఇక కొంతమంది రాత్రి మద్యం తాగితే మంచి నిద్ర పడుతుందని భావిస్తారని, ఇందులో ఏమాత్రం నిజం లేదని చెప్పారు. దానివల్ల నిద్రకు భంగం కలుగుతుందన్నారు.
Share It
News March 10, 2026
యుద్ధం సెగ.. పాక్ కఠిన నిర్ణయాలు

ఇరాన్ యుద్ధం సెగ పాక్‌కు గట్టిగానే తగులుతోంది. ఇంధన కొరతను నివారించేందుకు అక్కడి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ వాహనాల ఇంధన కోటాలో 50% కోత విధించింది. 60% వాహనాలను నడపొద్దని నిర్ణయించింది. మంత్రులు, ఎంపీల జీతాల్లో కోత పెట్టింది. ఆఫీసులను వారానికి 4 రోజులు మాత్రమే తెరవనుంది. స్కూళ్లకు 15 రోజులు సెలవులిచ్చింది. ఉన్నత విద్యాసంస్థల్లో ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభించాలని సూచించింది.
News March 9, 2026
నా కొడుకు సెంచరీ ముఖ్యం కాదు: సంజూ తండ్రి

భారత్ ప్రపంచకప్ గెలవడం ఆనందంగా, గర్వంగా ఉందని సంజూ శాంసన్ తండ్రి విశ్వనాథ్ తెలిపారు. ‘సంజూ కోసం దేశంలో చాలా మంది ప్రార్థించారు. ఇప్పుడు వారంతా సంతోషంగా ఉంటారు. సెమీఫైనల్లో 250 రన్స్ చేసినా మనం 6-7 రన్స్ తేడాతోనే గెలిచాం. నా కొడుకు సెంచరీ ముఖ్యం కాదు. దాని కోసం 1-2 బాల్స్ కూడా మిస్ చేయకూడదు’ అని చెప్పారు.


