News May 2, 2024
జగన్‌పై ఈసీ నిషేధం విధించాలి: ప్రత్తిపాటి

AP: సీఎం జగన్‌పై ఈసీ నిషేధం విధించాలని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. ‘జగన్ పదే పదే కోడ్ ఉల్లంఘిస్తున్నారు. విపక్ష నేతల వ్యక్తిగత జీవితాలపై ఆరోపణలు చేస్తున్నారు. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. అబద్ధాలతో ప్రతిపక్ష నేతలపై బురద జల్లుతున్నారు. పవన్, చంద్రబాబును అసభ్యంగా తిడుతున్నారు. తెలంగాణలో కేసీఆర్‌లాగే ఏపీలో జగన్‌పైనా నిషేధం విధించాలి’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News December 10, 2025
గాయపడిన సింహం.. తిరిగొచ్చి అదరగొట్టింది!

‘గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జనకన్నా భయంకరంగా ఉంటుంది’ అనే డైలాగ్ హార్దిక్ పాండ్యకు సరిగ్గా సరిపోతుంది. గాయం నుంచి కోలుకుని SAతో తొలి T20లో రీఎంట్రీ ఇచ్చిన అతడు 28 బంతుల్లో 59* రన్స్ చేశారు. ఓవైపు ఇతర బ్యాటర్లు వికెట్ కాపాడుకునేందుకే అవస్థలు పడుతుంటే పాండ్య మాత్రం కామ్&కంపోజ్డ్ షాట్లతో విరుచుకుపడ్డారు. బౌలింగ్‌లోనూ తొలి బంతికే వికెట్ తీశారు. ఇరు జట్లలో వేరే ఏ ఆటగాడు 30+ స్కోర్ చేయలేదు.
News December 10, 2025
తిరుమల శ్రీవారి చెంత బయటపడ్డ మరో స్కాం

కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వరుడిని మోసం చేసిన మరో స్కాం బయటకొచ్చింది. వేద ఆశీర్వచనం పొందే ప్రముఖులకు ఇచ్చే పట్టువస్త్రాల (సారిగ దుపట్టా) కొనుగోలులో భారీ మోసం, అక్రమాలు జరిగినట్లు TTD విజిలెన్స్ గుర్తించింది. నగరికి చెందిన VRS ఎక్స్‌పోర్ట్స్ ₹100 విలువ చేయని పాలిస్టర్ క్లాత్‌ను పట్టు అని ₹1400కు సరఫరా చేసినట్లు బోర్డుకు తెలిపింది. 2015-25 మధ్య ఇలా శ్రీవారి ఖజానా నుంచి ₹54 కోట్లు దోచుకుంది.
News December 10, 2025
రేపటి నుంచి భవానీ దీక్షల విరమణ

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ప్రారంభంకానున్న భవానీ మండల దీక్ష విరమణకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ నెల 15 వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమానికి 7 లక్షల మంది భవానీలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గిరి ప్రదక్షిణ కోసం 9 కి.మీ. మార్గాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేశారు. భవానీల కోసం 3 హోమగుండాలు, నిత్య అన్నదానం, రైల్వే స్టేషన్- బస్ స్టాండ్‌ల నుంచి బస్సులు ఏర్పాటు చేశారు.


