News March 27, 2024

‘వివేకం’ సినిమాపై ఈసీ కీలక ఆదేశాలు

image

AP: రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన ‘వివేకం’ సినిమా ప్రదర్శనపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మూవీ స్ట్రీమింగ్ కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. కాగా ఈ మూవీ హింసను ప్రేరేపించేదిగా, ప్రజలను రెచ్చగొట్టేదిగా ఉందని ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది. దీంతో ఈసీ చర్యలకు దిగింది.

Similar News

News February 11, 2026

అమరావతి ఏపీకి శాశ్వత రాజధాని: గవర్నర్

image

AP: అమరావతి రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా ఉంటుందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. ‘క్వాంటం టెక్నాలజీ ద్వారా అమరావతిని గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు సంకల్పించాం. అమరావతి భవిష్యత్తును నాశనం చేసే ఉద్దేశంతో గత ప్రభుత్వం 3 రాజధానుల ప్రతిపాదన తెచ్చింది. శ్వేతపత్రాల ద్వారా మా ప్రభుత్వం వాటిని ఎండగట్టింది. రాష్ట్ర GSDP రూ.15.91లక్షల కోట్ల నుంచి రూ.17.60లక్షల కోట్లకు పెరిగింది’ అని పేర్కొన్నారు.

News February 11, 2026

కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 5 సీనియర్ మేనేజర్, మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గలవారు మార్చి 12 వరకు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి CA, CMA, CS, ICSI మెంబర్ షిప్‌తో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ/పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.concorindia.co.in

News February 11, 2026

పితృ దోషంతో పెళ్లికి ఆటంకాలు ఎదురవుతాయా?

image

జాతకంలో పితృ దోషం ఉన్నప్పుడు సంతానంతో పాటు వివాహం కూడా ఆలస్యమవుతుంది. పూర్వీకుల ఆశీస్సులు లేకపోవడం వల్ల ఎన్ని సంబంధాలు చూసినా ఫలితం ఉండదు. దీనికి పరిష్కారంగా అమావాస్య రోజున పితృ తర్పణాలు వదలాలి. గయ, కాశీ వంటి క్షేత్రాలలో శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తే దోషం తొలగుతుంది. నిరుపేదలకు అన్నదానం చేయాలి. గోసేవ అత్యంత శ్రేష్ఠం. తద్వారా పితృ దేవతలు శాంతించి, త్వరగా పెళ్లి సంబంధం కుదిరేలా అనుగ్రహిస్తారు.