News April 13, 2024

సినీ నిర్మాతపై ఈడీ డ్రగ్స్ కేసు

image

తమిళ సినీ నిర్మాత, డీఎంకే మాజీ నేత జాఫర్ సాదిక్‌ డ్రగ్స్ రవాణాతో రూ. 40 కోట్లకు పైగా సంపాదించారని ఈడీ తాజాగా ఆరోపించింది. ఆ మొత్తాన్ని రియల్ ఎస్టేట్, చిత్ర నిర్మాణంలోకి మళ్లించినట్లు తెలిపింది. రూ. 12 కోట్లు మూవీ ప్రొడక్షన్‌లో, రూ.21 కోట్లు బ్యాంకు ఖాతాల్లో ఉన్నాయని పేర్కొంది. సాదిక్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో గత నెలలో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

Similar News

News December 13, 2025

MLAల చేతుల్లో MRO ఆఫీసులు: ధర్మాన

image

AP: భూ సమస్యలు తీరక సామాన్యులు బాధపడుతున్నారని మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. ‘5 సెంటీమీటర్ల తేడా కూడా లేకుండా కొలతలు చేయగల టెక్నాలజీతో భూ సర్వే జరుపుతుంటే, సర్టిఫికెట్‌పై జగన్ బొమ్ముందని, భూములు ఆయన తీసుకుంటారని చంద్రబాబు మాయ మాటలు చెప్పారు. ఇన్నేళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఒక్క భూ సంస్కరణ అయినా తెచ్చారా? నేడు ఎమ్మార్వో కార్యాలయాలన్నీ ఎమ్మెల్యేల చేతుల్లోకి వెళ్లిపోయాయి’ అని విమర్శించారు.

News December 13, 2025

కార్పొరేటర్‌గా గెలిచిన మాజీ DGP

image

కేరళ మాజీ DGP ఆర్.శ్రీలేఖ కార్పొరేటర్‌గా గెలిచారు. తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి, శాస్తమంగళం డివిజన్ నుంచి విజయం సాధించారు. కేరళ తొలి మహిళా ఐపీఎస్‌గా 1987లో శ్రీలేఖ ఎంపికయ్యారు. సీబీఐలో డిప్యూటేషన్‌పై పని చేసిన సమయంలో హైప్రొఫైల్ ఆపరేషన్లతో ‘రైడ్ శ్రీలేఖ’గా పేరు పొందారు. 33 ఏళ్ల సర్వీసు తర్వాత 2020లో డీజీపీ హోదాలో రిటైర్ అయ్యారు. తర్వాత బీజేపీలో చేరారు.

News December 13, 2025

సమస్త సృష్టిని తనలో లయం చేసుకోగల సంగ్రహుడు

image

ఉపేంద్రో వామనః ప్రాంశురమోఘః శుచిరూర్జితః|
అతీంద్రః సంగ్రహః సర్గో ధృతాత్మా నియమో యమః||
ఇంద్రుని సోదరుడు ఉపేంద్రుడు, పొట్టి రూపుడైన వామనుడు, అతి పొడవైన ప్రాంశువు.. ఇవన్నీ విష్ణు నామాలే. ఆయన చేసే పనులు ఎన్నడూ వ్యర్థం కావు. పవిత్రమైన ఆయన బలమైనవాడు. అతీంద్రుడు. సమస్త సృష్టిని తనలో లయం చేసుకోగల సంగ్రహుడు. మన యోగ్యతను బట్టి పునర్జన్మలు ఇస్తాడు. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>