News May 13, 2024
Elections: IAF మాజీ చీఫ్ ఫ్యామిలీకి ఊహించని పరిణామం

పుణెలో ఓటు వేసేందుకు వెళ్లిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మాజీ చీఫ్ ప్రదీప్ వసంత్ నాయక్ ఫ్యామిలీకి ఊహించని పరిణామం ఎదురైంది. ఓటర్ లిస్టులో తన భార్య పేరు లేదని తెలిసి ఆయన ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. స్థానిక నేతలు ఇచ్చిన ఓటర్ స్లిప్పులున్నా కూడా లిస్టులో పేరు లేకపోవడానికి గల కారణాలను గుర్తించాలని ఆయన అన్నారు. ఓటర్ల పేర్లు తొలగించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
Similar News
News December 14, 2025
కూటమి పాలనలో అప్పుల రాష్ట్రంగా ఏపీ: బొత్స

AP: ఆరోగ్యంగా ఉన్న ఏపీ కూటమి పాలనలో అప్పుల రాష్ట్రంగా దూసుకుపోతుందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. ‘18 నెలల వ్యవధిలోనే రూ.2.66 లక్షల కోట్లు అప్పు చేసింది. మేము అధికారంలో ఉన్న ఐదేళ్లలో సంక్షేమ పథకాల ఖర్చుకు రూ.3.45 లక్షలు కోట్లు అప్పు చేశాము. అయితే కూటమి ప్రభుత్వం అప్పులు ఎందుకు చేస్తుందో ఎవరికీ తెలియదు. పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వక ఈ ప్రభుత్వం రైతులను కష్టపెడుతుంది’ అని ఫైరయ్యారు.
News December 14, 2025
డిసెంబర్ 14: చరిత్రలో ఈ రోజు

✤ 1799: అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ మరణం
✤1924: బాలీవుడ్ నటుడు రాజ్ కపూర్ జననం
✤ 1978: నటి సమీరా రెడ్డి జననం
✤ 1982: దక్షిణాది నటుడు ఆది పినిశెట్టి జననం
✤ 1984: నటుడు రానా జననం(ఫొటోలో)
✤ 2014: ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్, నటుడు పీజే శర్మ మరణం
✤ జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం
✤ అంతర్జాతీయ కోతుల దినోత్సవం
News December 14, 2025
మూవీ ముచ్చట్లు

* బిగ్ బాస్ తెలుగు సీజన్-9 నుంచి కమెడియన్ సుమన్ శెట్టి ఎలిమినేట్. ఇవాళ మరొకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్!
* ప్రభాస్, మారుతి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘రాజాసాబ్’ రిలీజ్ డేట్(జనవరి 9)లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్
* అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న ‘డెకాయిట్’ మూవీ టీజర్ ఈ నెల 18న విడుదల.. వచ్చే ఏడాది మార్చి 19న థియేటర్లలో రిలీజ్ కానున్న సినిమా


