News April 1, 2024
ఎలక్టోరల్ బాండ్స్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ కాదు: PM మోదీ

ఎలక్టోరల్ బాండ్స్‌ను సుప్రీం కోర్టు రద్దు చేయడంపై ప్రధాని మోదీ స్పందించారు. ఇది ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ కాదని ఆయన అన్నారు. ఏ వ్యవస్థ కూడా పర్ఫెక్ట్‌గా ఉండదని, ఏ లోపాలున్నా సవరించవచ్చని అన్నారు. తమకు ఎందుకు ఎదురు దెబ్బ అవుతుందని ప్రశ్నించారు. ఈ విషయంపై చంకలు గుద్దుకుంటున్న వారు పశ్చాత్తాప పడక తప్పదని ఆయన అన్నారు. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా BJPకి అత్యధికంగా విరాళాలు వచ్చిన విషయం తెలిసిందే.
Similar News
News February 13, 2026
JIPMERలో జూనియర్ రెసిడెంట్ పోస్టులు

<
News February 13, 2026
అదృష్టం వరించింది.. టాస్‌తో గెలిచారు

TG: దుబ్బాక మున్సిపాలిటీ ఎన్నికల్లో మూడో వార్డు కౌంటింగులో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. BRS అభ్యర్థి కంకణాల ఎల్లవ్వ, బీజేపీ అభ్యర్థి శ్రీలత మధ్య చివరి వరకు తీవ్ర పోటీ నెలకొంది. ఇద్దరికి సమానంగా ఓట్లు వచ్చాయి. రీకౌంటింగ్ చేసినా ఫలితం మారలేదు. దీంతో అభ్యర్థుల సమ్మతితో టాస్ వేయగా ఎల్లవ్వను అదృష్టం వరించింది. దీంతో ఆమెను విజేతగా ప్రకటించారు.
News February 13, 2026
పిల్లల్లో మలబద్ధకానికి కారణాలివే..

పిల్లల్లో మలబద్ధకానికి ఎన్నో కారణాలుంటాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా తగినంత ఫైబర్, నీరు తీసుకోకపోవడం వల్ల ఈ సమస్య వస్తుందంటున్నారు. IBS సమస్య ఉన్న చిన్నారుల్లో కూడా మలబద్ధకం కామన్‌గా కనిపిస్తుంది. ప్రయాణాలు, క్రమరహిత భోజన సమయాలు, జీవనశైలిలో తీవ్రమైన మార్పులు జీర్ణవ్యవస్థను ఇబ్బంది పెడతాయి. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్లో అసౌకర్యాన్ని ఎప్పటికప్పుడు గమనించాలని సూచిస్తున్నారు.


