News April 28, 2024
ఎల్లుండి మేనిఫెస్టో ప్రకటన: పవన్ కళ్యాణ్

AP: ఎన్డీఏ మేనిఫెస్టోను ఎల్లుండి ప్రకటించనున్నట్లు JSP అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. TDP-JSP-BJP కూటమికి ఓటు వేయకపోతే ప్రజలకే నష్టం అని అన్నారు. ‘PM మోదీ దగ్గర ఏదైనా మాట్లాడాలంటే జగన్‌కు భయం. ఆయన దగ్గరకు వెళ్లి కేసులు కొట్టేయాలని కోరుతారు. నాకు అవినీతి చేయాల్సిన అవసరం లేదు. మోదీతో నేను ధైర్యంగా మాట్లాడగలను. కష్టాల్లో ఉన్న రైతుల కన్నీరు తుడవడమే నాకు ఆనందం’ అని ఏలేశ్వరం సభలో వ్యాఖ్యానించారు.
Similar News
News April 14, 2026
ఆర్టీసీ కార్మికులు సమ్మె నిర్ణయం వెనక్కు తీసుకోవాలి: పొన్నం

ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ప్రజల ప్రయోజనాల దృష్ట్యా సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని తెలిపారు. విలీనం, కార్మిక సంఘాల అంశాలు ప్రభుత్వ పరిధిలో ఉన్నాయని, దీనిపై ఒక కమిటీ పని చేస్తోందని, ఉద్యోగులు సమస్యలు చెప్పుకునేందుకు ప్రభుత్వ తలుపులు తెరిచి ఉన్నాయని, మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
News April 14, 2026
IEBలో 28 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

ఇండియన్ ఎగ్జిమ్ బ్యాంక్(IEB), ముంబైలో 28 పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. వీటిలో మేనేజ్‌మెంట్ ట్రెయినీ-22, డిప్యూటీ మేనేజర్-5, చీఫ్ మేనేజర్-1 పోస్టులున్నాయి. 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిగ్రీ, LLB/BE/B.Tech/PGతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం www.eximbankindia.in చూడండి.
News April 14, 2026
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా.. టైటిల్ ఇదే?

గతేడాది సూపర్ హిట్‌గా నిలిచిన ‘OG’ సినిమా పార్ట్-2 పనులు మొదలైనట్లు సమాచారం. ఇందులో పవర్ స్టార్ మేనరిజమ్స్, యాక్షన్ సీక్వెన్స్ మరో లెవెల్‌లో ఉంటాయని తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘ఓజస్ గంభీర-ర్యాంపేజ్ బిగిన్స్’ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టును పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తాయని టాక్. పవన్ డేట్స్‌ను బట్టి షూటింగ్ మొదలవుతుందట.


