News June 19, 2024
ఎల్లుండి రాష్ట్ర కేబినెట్ భేటీ!

TG: ఈ నెల 21న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఆగస్టు 15లోగా రైతులకు పంట రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ అంశంపై చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ రూపకల్పనపై భేటీలో చర్చించనున్నట్లు సమాచారం.
Similar News
News January 24, 2026
పండ్ల తోటల్లో పశుగ్రాసం సాగుతో లాభాలు

డెయిరీ ఫామ్ నడుపుతూ పండ్ల తోటలను పెంచుతుంటే వాటిలో పశుగ్రాసం సాగు చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. మామిడి, జామ, నిమ్మ, సపోట, సీతాఫలం, బత్తాయి, కొబ్బరి తోటల్లో.. లూసర్న్, బెర్సీమ్, అలసంద, పిల్లిపెసర, జనుము వంటి లెగ్యూమ్ జాతి గ్రాసాలను పెంచుకోవచ్చు. దీని వల్ల భూమిలో నత్రజని శాతం గణనీయంగా పెరిగి, పండ్ల తోటలకు రసాయన ఎరువులను వాడకం తగ్గుతుంది. ఈ పైరుల సాగును ప్రతీ 3-4 ఏళ్లకు ఒకసారి మార్చాలి.
News January 24, 2026
అరుణోదయ స్నానం ఎలా చేయాలంటే?

సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. తూర్పు ముఖంగా నదిలో నిలబడి తలపై ఒకటి, భుజాలు, మోచేతులు, మోకాళ్లపై 2 చొప్పున మొత్తం 7 జిల్లేడు ఆకులను, వాటిపై రేగుపళ్లను ఉంచి స్నానం చేయాలి. అలాగే సూర్య మంత్రాలు పఠించాలి. నెత్తిన రేగుపళ్లు పోసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. స్నానానంతరం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. తద్వారా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, గత జన్మ పాపాలు నశిస్తాయని నమ్మకం.
News January 24, 2026
రానున్న 24 గంటల్లో వర్షాలు

AP: బంగాళాఖాతం నుంచి వీస్తున్న తూర్పుగాలుల ప్రభావంతో రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. అలాగే ఉత్తర కోస్తాలో పొగమంచు కురుస్తుందని, 2-3డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోతాయని చెప్పింది. మరోవైపు నిన్న దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలుచోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. అల్లూరి (D) జి.మాడుగులలో 6.3డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.


