News May 2, 2024
ఇంగ్లండ్ క్రికెటర్‌కు గుండె జబ్బు.. 23 ఏళ్లకే రిటైర్మెంట్

ఇంగ్లండ్ కౌంటీ క్రికెటర్ బెన్ వెల్స్ 23 ఏళ్లకే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించారు. అతను అరిథమిక్ రైట్ వెంట్రిక్యులర్ కార్డియోమయోపతి(AVRC)తో బాధపడుతున్నారు. ఈ వ్యాధి ఉన్నవారు పరిగెత్తడం, వ్యాయామం లాంటి శారీరక శ్రమకు దూరంగా ఉండాలి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆటకు గుడ్‌బై చెప్పారు. వికెట్ కీపర్, బ్యాటర్ అయిన వెల్స్ 2021 నుంచి 9 టీ20లు, ఓ ఫస్ట్ క్లాస్ మ్యాచ్, 15 లిస్ట్-A మ్యాచ్‌లు ఆడారు.
Similar News
News December 14, 2025
సంజయ్ గాంధీ మెమోరియల్ హాస్పిటల్‌లో ఉద్యోగాలు

ఢిల్లీలోని <
News December 14, 2025
ఓపెన్ పోర్స్ తగ్గడానికి ముల్తానీ మట్టితో ప్యాక్

మొటిమలు, పొల్యూషన్ కారణంగా చాలా మందిలో ముఖంలో ఓపెన్ పోర్స్ వస్తాయి. వీటిని తగ్గించుకునేందుకు ముల్తానీ మట్టితో ఫేస్ ప్యాక్ ఉపయోగపడుతుంది. ముల్తానీ మట్టి, పసుపు, రోజ్ వాటర్ మిక్స్ చేసుకోవాలి. ఈ ప్యాక్‌ని రాసుకొని 15ని. తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని మసాజ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి. ఈ ప్యాక్ వారానికి రెండుసార్లు వేసుకుంటే ఫలితం ఉంటుంది. శనగపిండి ప్యాక్ కూడా బాగా ఉపయోగపడుతుంది. #SkinCare
News December 14, 2025
బిగ్‌బాస్-9.. భరణి ఎలిమినేట్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉన్న విషయం తెలిసిందే. నిన్న అంతా ఎక్స్‌పెక్ట్ చేసినట్లుగానే సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. ఆదివారం ఎపిసోడ్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారా? అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే ఇవాళ భరణి ఎలిమినేట్ కానున్నారని SMలో పోస్టులు వైరలవుతున్నాయి. అదే జరిగితే కళ్యాణ్, తనూజ, ఇమ్మాన్యుయేల్, డిమాన్ పవన్, సంజన టాప్-5కి చేరుకుంటారు.


